CM Jagan : వైసీపీ నాలుగో లిస్ట్.. ఎప్పుడంటే?

ఇప్పటికే ఇంఛార్జిలను నియమిస్తూ మూడు లిస్టులను విడుదల చేసిన వైసీపీ. ఇప్పుడు నాలుగో లిస్టుపై కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తరువాతే ఈ నాలుగో లిస్టును వైసీపీ అధిష్టానం విడుదల చేయనుంది. దాదాపు 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా కొత్త ఇంఛార్జులను వైసీపీ నియమించింది.

New Update
CM Jagan: సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా?

YCP Fourth List : మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) తో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యం సీఎం జగన్(CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్థానాల్లో టార్గెట్ 175 కి 175 సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే ఎంపీ స్థానాల్లో అన్ని స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్ళురుతున్నారు. ఈ క్రమంలో సర్వేలలో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను మారుస్తున్నారు. ఇప్పటికే ఇంఛార్జిలను నియమిస్తూ వైసీపీ అధిష్టానం మూడు లిస్టులను విడుదల చేసింది. తాజాగా నాలుగో లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది.

ALSO READ: నేడు మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు

జగన్ జిల్లాల పర్యటన...

ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో విజయడంక మోగించేందుకు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రచారాన్ని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ(TDP), జనసేన(Janasena) మొదలు పెట్టాయి. సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగుతున్నాయి. జిల్లాల పర్యటనలు, సభలు పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. అయితే.. ప్రతిపక్షాలు తమ పార్టీపై చేస్తున్న విష ప్రచారాలను తిప్పి కొట్టేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.

రూట్ మ్యాప్ పై తాయారు...

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఈ నెల 25 నుంచి చేపట్టబోయే జిల్లాల పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది వైసీపీ అధిష్టానం. ఉత్తరాంధ్ర నుంచి సీఎం జగన్ తన జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రోజుకు రెండు జిల్లాల్లో పర్యటించేదేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది.. ఏమి అభివృద్ధి పనులను చేసిందో రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఈ ప్రచారాల్లో చెప్పనున్నారు. అలాగే.. మరోసారి అదికారంలోకి వస్తే ఎలాంటి పనులు చేస్తామో ప్రజలకు వివరించనున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

నాలుగో లిస్ట్.. అప్పుడే?

వైనాట్ 175 దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ ఇప్పటికే ఇంఛార్జులను నియమిస్తూ మూడు లిస్టులను విడుదల చేసింది. సుమారు 60 మంది అభ్యర్థులను మార్చింది. ఇటీవల విడుదల చేసిన మూడో లిస్టులో ఆరు ఎంపీ స్థానాల ఇంఛార్జిలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాలుగో లిస్ట్ ఎప్పుడు విడుదల అవుతుందనే ఉత్కంఠ వైసీపీ ఎమ్మెల్యేలలో నెలకొంది. నాలుగో లిస్టులోనైనా తమ పేరు ఉంటుందో లేదో అనే టెన్షన్ వారిలో నెలకొంది. అయితే.. నాలుగో లిస్టుపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం సంక్రాంతి తరువాతే ఈ లిస్టును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటన చేపట్టనుండడంతో దీనికి ముందుగానే ఈ నాలుగో లిస్ట్ విడుదల కానున్నట్లు సమాచారం.

ALSO READ: ఢిల్లీలో సీఎం రేవంత్.. కోటి ఆశలతో కోదండరాం!

Advertisment
తాజా కథనాలు