Chandrababu: కూటమి కీలక నిర్ణయం.. 5 సీట్లలో మార్పు.!

చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ ముగిసింది. సీట్ల మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనపర్తి, ఉండి స్థానాలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనపర్తి టీడీపీకి ఇవ్వాల్సి వస్తే.. ఓ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Chandrababu: కూటమి కీలక నిర్ణయం.. 5 సీట్లలో మార్పు.!
New Update

TDP Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ ముగిసింది. సీట్ల మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనపర్తి, ఉండి స్థానాలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనపర్తి టీడీపీకి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు బీజేపీ సిద్ధం చేసింది. తంబళ్లపల్లె లేదా ఏలూరు లేదా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఓ స్థానం బీజేపీ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయ లోపంపైనా చర్చించారు. రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు వీలైనన్ని ఎక్కువ సభల్లో మూడు పార్టీల నేతలు పాల్గొనేలా కార్యాచరణపై చర్చ జరిగినట్లు సమాచారం.

భేటీలో తీసుకున్న నిర్ణయాలు..

* బూత్‌, అసెంబ్లీ, పార్లమెంట్‌ పరిధిలో సమావేశాలు జరపాలని ఎన్డీఏ నేతల నిర్ణయం

* ప్రచారం, ఎన్నికల నిర్వహణ పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం

* ప్రచార వ్యూహం తయారీకి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం

* ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

* గోదావరి జిల్లాల్లో కూటమి సభల విజయంపై నేతల సంతృప్తి

* సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయం

* ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం

* కూటమి తరఫున మోడీ, అమిత్‌ షా, నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొనేలా ప్రణాళిక

* 25 లోక్‌సభ, 160కు పైగా అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయాలని నిర్ణయం

#janasena #ap-elections #bjp #chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe