TDP, Janasena Leaders Joins In YSRCP: అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీలో గోరుముచ్చు గోపాల్ యాదవ్ చేరారు. ఆయన సీఎం జగన్ (CM Jagan) పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు గోపాల్ యాదవ్. టీడీపీపై గోపాల్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. యనమల రామకృష్ణుడే తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని అన్నారు.
అటు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో.. మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ యాదవ్, సూళ్ళూరుపేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి చేరారు. వైసీపీలోకి జనసేన విజయవాడ(తూర్పు) ఇంఛార్జ్ బత్తిన రాము చేరారు.
విజయవాడ నుంచి పలువురు నేతలు..
* వైసీపీ పార్టీలో చేరిన వారిలో గండూరి మహేష్, నందెపు జగదీష్ (మాజీ కార్పొరేటర్లు)
* కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్ మెంబర్), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ
* గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి)
* ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్.
Also Read: టికెట్ దక్కని ఆ ముఖ్యనేతలకు పార్టీ పదవులు.. ప్రకటించిన చంద్రబాబు!