AP DGP: మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ కు షాక్ ఇచ్చేందుకు బీజేపీ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీడీపీ - జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఏపీలో వైసీపీ గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో వేగంగా పావులు కదుపుతోంది బీజేపీ. వైసీపీకి చెక్ పెట్టేలా పక్కాగా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.
డీజీపీపై వేటు?..
ఏపీ డీజీపీ బదిలీకి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏపీ డీజీపీపై ఈసీ వేటు? వేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఏపీలో ఓ ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. మరో 22 మంది IPSలను తప్పించాలంటూ ఇప్పటికే ఈసీకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి లేఖ రాశారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నుంచి, నాన్‌కేడర్ ఎస్పీ ఆనంద్‌రెడ్డి వరకు మొత్తం 22 మంది పేర్లు.. వారిపై అభియోగాలను ఈసీకి పురంధేశ్వరి పంపారు. మరి దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈసీ కీలక నిర్ణయం..
ఏప్రిల్ 2న ఈసీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పలువురు ఉన్నతాధికారులపై వేటు వేసింది. వేటు పడిన వారిలో ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు ఉన్నారు. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి పంపాలని స్టేట్ సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.
బదిలీ అయిన వారు..
* చిత్తూరు ఎస్పీ జాషువా బదిలీ
* పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి బదిలీ వేటు
* ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్
* అనంతపురం ఎస్పీ అన్బురాజన్
* నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్
* గుంటూరు రేంజ్ ఐజీ పాల్‌రాజు
* కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు
* అనంతపురం కలెక్టర్ గౌతమి
* తిరుపతి కలెక్టర్ లక్ష్మిషా