AP Assembly Elections: ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. సిట్టింగ్ లను మార్చాలని వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వల్లే కొందరు వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఇదే బాటలో మరో వైసీపీ నేత ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
ఒంగోలు ఎంపీ సీటు..
ఒంగోలు ఎంపీ సీటుపై ఇటు వైసీపీ, అటు టీడీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటికే కొంత మంది ఇంఛార్జిలను మారుస్తూ సీఎం జగన్ మూడు లిస్టులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒంగోలు టికెట్ ఎవరికీ ఇవ్వాలనే విషయం పై సీఎం జగన్ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ప్రస్తుతం అక్కడి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని సమాచారం.
ALSO READ: పెట్రోల్, డీజిల్ పై రూ.10 తగ్గింపు.. కేంద్రం కీలక ప్రకటన?
కనిగిరి సీటు ఇవ్వండి..
కొడుకు రాఘవరెడ్డి టికెట్ కోసం ఎంపీ మాగుంట ప్రయత్నాలు చేస్తున్నారట. తన కొడుకుకి కనిగిరి సీటు ఇవ్వాలని ఎంపీ మాగుంట వైసీపీ అధిష్టాన్ని పట్టు బట్టినట్లు తెలుస్తోంది. ఎంపీ మాగుంట అడిగిన దానికి వైసీపీ అధిష్టానం నిరాకరించినట్లు సమాచారం. తన కొడుకుకి కూడా టికెట్ ఇస్తేనే వైసీపీ నుంచి పోటీ చేస్తానని మాగుంట శ్రీనివాసులు వైసీపీన్ అధిష్టానికి చెప్పినట్లు తెలుస్తోంది.
టీడీపీ లేదా జనసేనలోకి...
వైసీపీ అధిష్టానం తన డిమాండ్లను ఒప్పుకోకపోతే వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఆ పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ లేదా జనసేనలో చేరుతారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. దీనిపై టీడీపీ, జనసేన నేతలతో ఎంపీ మాగుంట చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ తన కుమారుడికి టికెట్ నిరాకరిస్తే టీడీపీ లేదా జనసేన నుంచి వైసీపీ పై పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఒంగోలు టికెట్ ఎవరికి?
ఒకవేళ ప్రస్తుతం ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు పార్టీ రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాగుంట స్థానంలో దర్శి MLA మద్దిశెట్టి వేణుగోపాల్, YV సుబ్బారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.