YS Sharmila: వైఎస్సార్‌కు వారసుడు ఎలా అవుతాడు.. జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్‌కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారు? అని అన్నారు షర్మిల. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుందని అన్నారు. By V.J Reddy 06 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి AP Congress Chief YS Sharmila: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పర్యటనలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ముస్లిం మైనార్టీల కోసం 4 శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి సమాజంలో సమున్నత స్థానాన్ని అందించారు దివంగత మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ALSO READ: గద్దర్‌కు సీఎం రేవంత్ అన్యాయం.. దాసోజు శ్రవణ్ ఫైర్ అలాంటిది బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్ కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారు? అని నిలదీశారు. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఇమామ్ లకు రూ.15 వేలు వేతనం, ముస్లిం బ్యాంక్, చనిపోతే రూ.5 లక్షల బీమా వంటి ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారని అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు ముస్లింల పక్షాన లేరు.. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుందని అన్నారు. వారి సంక్షేమం కోరుకుంటుందని తెలిపారు. అందుకే ఆలోచించండి ధర్మం వైపు నిలబడండి.. కడప ఎంపీగా పోటీచేస్తున్నాను..ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా.. వైఎస్సార్ లాగా సేవ చేస్తానని మాట ఇచ్చారు. #ap-elections-2024 #ys-sharmila #cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి