Kapu Ramachandra Reddy: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని వైసీపీకి రాజీనామా చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ క్రమంలో ఈరోజు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు.

Kapu Ramachandra Reddy: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
New Update

YCP MLA Kapu Ramachandra Reddy To Join BJP: అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఇటీవల టికెట్ దక్కక వైసీపీకి (YCP) రాజీనామా చేసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆహ్వానం మేరకు ఆయన ఈ రోజు జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీ జరిగే హోటల్ కు వచ్చారు. అక్కడ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను (Rajnath Singh) కలిశారు. అయితే.. ఆయన కాషాయ కండువా కప్పుకోబోయే తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ALSO READ: కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.. హరీష్ రావు డిమాండ్

టికెట్ రాలేదని..

ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో వేడెక్కాయి. నేతల రాజీనామాలు, చేరికలతో రాజకీయాలు రగులుతున్నాయి. అయితే.. ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న సీఎం జగన్.. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ (CM Jagan) తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ రాలేదు. దీంతో వైసీపీ అధిష్టానంపై గుస్సా మీద ఉన్న కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి..వేరే పార్టీలోకి జంప్ అవుతన్నారు.

ఇదిలా ఉండగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు సీఎం జగన్. దీంతో పార్టీపైన అసంతృప్తిగా ఉన్న ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ తనను మంత్రిని చేస్తానని నమ్మించి మోసం చేశాడని.. ఈసారి ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వకుండా తనకు అన్యాయం చేశారని ఆరోపణలు చేశారు. వైసీపీకి ఎవరు లేని సమయంలో జగన్ కు తోడుగా ఉండేందుకు కాంగ్రెస్ ను వదిలి వైసీపీలో చేరినందుకు జగన్ తగిన బుద్ధి చెప్పాడంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అనుకున్నారు..

కాంగ్రెస్ పార్టీని (Congress Party) వీడి వైసీపీలో చేరిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తిరిగి రాజీనామా అనంతరం ఆయన కాంగ్రెస్ లో చేరుతారని అనుకున్నారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు చేశారు. అయితే.. చివరికి ఎవరి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ లో కాకుండా బీజేపీలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

#bjp #cm-jagan #ap-assembly-elections-2024 #ap-bjp-chief-purandeswari #kapu-ramachandra-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe