AP Elections 2024 : టీడీపీ(TDP) నేత నారా లోకేశ్(Nara Lokesh) కు కోపం(Angry) వచ్చింది. పదేపదే పోలీసులు తన కారును చెక్ చేస్తుండడంతో సహనం కోల్పోయిన లోకేశ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆపుతారని నిలదీశారు. ఎంపీల కారులను కూడా చెక్ చేస్తున్నామని పోలీసులు బదలివ్వడంతో లోకేశ్‌కు కోపం మరింత ఎక్కువైంది. అయోధ్యరామిరెడ్డి గారి కారు చెక్ చేశారా అని రివర్స్ అటాక్‌కు దిగారు లోకేశ్. మూడు రోజుల్లో నాలుగు సార్లు తన కారు చెక్ చేశారని ఫైర్ అయ్యారు. లోకేశ్ మాట్లాడుతుంటే చెకింగ్ అధికారుల వెంట నోట మాట లేదు. అటు లోకేశ్ విశ్వరూపం చూసి తెలుగు తమ్ముళ్లు మురిసిపోతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు లోకేశ్ అని మెచ్చుకుంటున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకోని వైసీపీ(YCP) కావాలనే లోకేశ్ కారును అదే పనిగా చెక్ చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
ఎన్నిసార్లు ఆపుతారు?
నిజానికి ఎన్నికల కోడ్(Election Code) వేళ కార్ల తనిఖీ సాధారణ విషయమే. ఏ రాష్ట్రంలోనైనా ఇలానే చెక్ చేస్తారు. అయితే పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా ఉంటారన్నది పబ్లిక్ టాక్. అందుకే ప్రతిపక్ష నేతల కార్లు చెక్ చేసినా ప్రతిసారీ ఇలాంటి ఇష్యూ అవుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుందంటున్నారు తెలుగు దేశం కార్యకర్తలు. మూడు రోజుల్లో మూడు సార్లు తన కారును తనిఖీ చేసినా లోకేశ్ పోలీసులను ఏం అనలేదని.. వారి విధిని గౌరవించారని చెబుతున్నారు. కానీ నాలుగో సారి.. అది కూడా ఒక్క రోజులోనే రెండు సార్లు చెక్ చేయడంతో లోకేశ్‌కు కోపం వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ పేరుతో పోలీసులు ఎన్నిసార్లు కారు ఆపుతారని ప్రశ్నించిన లోకేశ్ డీజీపీ(DGP) పై ఫైర్ అయ్యారు. డీజీపీని తమాషాలు ఆడొద్దని చెప్పండంటూ స్థానిక పోలీసు అధికారిని హెచ్చరించారు. నా పరువు తియ్యలన్నదే మీ ఉద్దేశ్యమా అని నిలదీశారు లోకేశ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్‌గా మారింది.
Also Read : ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం