Lokesh: నీళ్లు అడిగితే చంపేస్తారా?.. జగన్ సర్కార్‌పై లోకేష్ ఫైర్

దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని అన్నారు లోకేష్. మాచర్లలో ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను టీడీపీ వాళ్ళని చెప్పి ట్రాక్టర్‌తో వైసీపీ సైకో గుద్ది చంపాడని మండిపడ్డారు. ఇదేనా మీ పాలనా అని నిలదీశారు.

AP Mega DSC : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే!
New Update

TDP Leader Lokesh: జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరం తండాలో తాగునీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వచ్చిన గిరిజన మహిళ సామినిబాయి (50)ని వైసిపికి చెందిన సైకో ట్రాక్టర్ తో తొక్కించి అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ALSO READ: బీజేపీ తొలి జాబితా విడుదల

వారంరోజులుగా గుక్కెడునీరు దొరకని పరిస్థితుల్లో రాకరాక వచ్చిన ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, నీళ్లు పట్టు కోవడానికి వీల్లేదని వైసీపీ సైకో బెదిరించారని లోకేష్ అన్నారు. తాగునీటికి పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే సామినీబాయి చేసిన నేరం అని ప్రశ్నించారు. మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలు చూశాక మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా, రాతియుగంలోనా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. వైసీపీకి చెందిన సైకో ఊరంతా చూస్తుండగా స్వైరవిహారం చేస్తూ 3 సార్లు ట్రాక్టర్ తో తొక్కించి సామినిబాయిని చంపేస్తే డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసుకట్టడం పతనమైన పోలీసు వ్యవస్థకు పరాకాష్ట కాదా? కంచే చేనుమేసిన చందంగా కొంతమంది పోలీసులు అరాచకశక్తులతో ఏకమైతే సామాన్య ప్రజలకు దిక్కెవరు?! అని నిలదీశారు.

ఏపీని జగన్ విద్వాంసం చేశారు: చంద్రబాబు

అహంకారంతో జగన్‌ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. జగన్‌ విధానాలు నచ్చక తిరుగుబాటు చేసే పరిస్థికి వచ్చారని అన్నారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం అందరూ అలోచించాలని కోరారు. ప్రజాసేవకు అంకితమైన ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానిస్తాం అని పేర్కొన్నారు. ఏపీలో రాబోయేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.

#chandrababu #ap-elections-2024 #lokesh #ap-latest-news #cm-jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి