CM Jagan: లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నేతల రాజీనామాలు చేరికలతో ఆసక్తికరంగా మారాయి. తాజాగా టీడీపీకి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు. ఇటీవల టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి రాకపోవడంతో వారు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
This browser does not support the video element.
చంద్రబాబు మోసం చేశారు: గొల్లపల్లి సూర్యారావు
వైసీపీలో చేరిన టీడీపీ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. విలువలు కలిగిన వ్యక్తిగా నేటి వరకు రాజకీయాలు చేశానని అన్నారు. పదవులు ఉన్నా లేకున్నా టీడీపీతో కలిసి రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చానని అన్నారు. నన్ను మెడ పట్టి బయటకు టీడీపీ నుంచి గెంటేశారని మండిపడ్డారు. అవమానకర పరిస్థితులు టీడీపీలో అనుభవించానని పేర్కొన్నారు.
అవమానాలు ఎదుర్కొన్న తనకు వైఎస్ జగన్ అక్కున చేర్చుకుని పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. టీడీపీ స్థాపించిన మొదటి రోజు నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. చంద్ర బాబు తన విషయంలో ఘోరమైన తప్పిదం చేశారని ఫైర్ అయ్యారు. అమలాపురం పార్లమెంట్ ఇస్తా అని చెప్పి తనను మోసం చేసి పండుల రవీంద్ర బాబుకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల మధ్య టీడీపీలో కొనసాగుతూ వాచినట్టు తెలిపారు.
టీడీపీలో సీనియర్ దళిత నాయకుడిని తానే అని అన్నారు. పొత్తులో ప్రకటించిన సీట్లలో తన పేరు లేదని వాపోయారు. తన పట్ల లోకేష్ చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. ఉంటే ఉండు పోతే పో అన్నట్లు టీడీపీలో తనను చూశారని పేర్కొన్నారు. తనకు పదవులతో సంబంధం లేదని.. సీఎం జగన్ ఎక్కడ పోటీ చేయమంటే చేస్తానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.