CM Jagan: వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ప్రొద్దుటూరు సభలో వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. వైఎస్ వివేకానందారెడ్డిని హత్య చేసిందే ఎవరో అందరికి తెలుసన్నారు. అసలైన హంతుకుడికి తన ఇద్దరి చెల్లెమ్మలు మద్దతు ఇస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
BIG BREAKING : సీఎం జగన్ రాజీనామా

CM Jagan: ప్రొద్దుటూర్‌ మేమంతా సిద్ధంబహిరంగ సభలో ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు సీఎం జగన్. రానున్న ఎన్నికల్లో పొరపాటు జరిగితే చంద్రముఖి మళ్లీ లకలక అంటుందని.. సైకిల్ మీద వచ్చి రక్తం తాగుతుందని చంద్రబాబును ఉద్దేశిస్తూ సీఎం జగన్ చురకలు అంటించారు. చంద్రబాబును నమ్మితే పథకాలను రద్దు చేసుకున్నట్టేనని అన్నారు. తనపై చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నాయని పేర్కొన్నారు.

ALSO READ: రాజీనామా చేసే దమ్ము ఉందా? .. సీఎంకు కేటీఆర్ సవాల్!

వివేకా హత్యపై..

వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపి.. అతిహీనంగా.. బహిరంగంగా హంతకుడు తిరుగుతున్నాడని అన్నారు సీఎం జగన్. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారని పేర్కొన్నారు. ఆ చంపినోడు ఉండాల్సినోడు జైల్లో.. నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా అని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం తపించి పోతున్న ఒకరిద్దరు నా వాళ్లు అని అన్నారు. చిన్నాన్నను అన్యాయంగా చంపారని అన్నారు. రాజకీయంగా నాపై నెట్టేసే యత్నం చేస్తున్నారని అన్నారు.

ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారని.. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి? అని ప్రశ్నించారు. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా అని వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం.. నేను మాత్రం ప్రజల పక్షం అని గర్వంగా చెబుతున్నా అని పేర్కొన్నారు. ఆ దేవుడు, ఆ ప్రజల్నే నమ్ముకున్నా.. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా అని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు