MLA Balineni Srinivasa Reddy: నేతల రాజీనామాలు చేరికలతో ఏపీ రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా ఒంగోలు (Ongole) వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA), మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో (TDP) చేరుతారనే ప్రచారం జోరందుకుంది. జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ మంత్రి బాలినేని. వైసీపీ విడడంపై క్లారిటీ ఇచ్చారు.
సీఎం జగన్ అలిగిన..
కొంతమంది తాను సీఎం జగన్ పై (CM Jagan) అలిగాను అని ప్రచారం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి బాలినేని. తాను ప్రజల కోసం ప్రశ్నించే మనిషినని పదవుల కోసం ఎదురుచూసే మనిషిని కాదని పేర్కొన్నారు. ఉన్న విషయం ఉన్నట్టుగా చెపుతా అని అన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పని చేసినట్లు తెలిపారు. అవసరం అయితే రాజకియాలు మానుకొంటాను కాని ప్రశ్నించడం మానుకోను అని తేల్చి చెప్పారు.
ALSO READ: మారుతున్న రాజకీయాలు.. వైసీపీలోకి వంగవీటి రాధా?
డబ్బులు లేక..
పీఆర్‌సీ ఇంకా అమలు తమ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై వివరణ ఇచ్చారు మంత్రి బాలినేని. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకనే పీఆర్‌సీని సీఎం జగన్ ఇవ్వలేదని ఇవ్వలేదని.. త్వరలోనే వస్తాయని భరోసాను ఇచ్చారు. ప్రజల సమస్యలను తీర్చేందుకే నిధులు సమీకరించాడని సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు అన్నారు.
టీడీపీలో చేరుతానా?..
సీఎం జగన్ పై మాగుంట శ్రీనివాస్ రెడ్ది కోసం పోరాడినట్లు తెలిపారు. ఆయనతో పాటు టీడీపీలోకి పోవాలనుకోలేదని తేల్చి చెప్పారు. చిత్త శుద్దితో ఉంటే ఎవరు ఏమి మాట్లాడినా లెక్కచెయ్యక్కర్లేదని హితవు పలికారు. పార్టీ లో ఉండి ద్రోహం చేసే వ్యక్తి ని తాను కాదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చెప్పిన మాటలే తనకు ఆదర్శం అన్నారు. సీఎం జగన్ కోసం పనిచేస్తానని..టీడీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని స్పష్టం చేశారు.