TDP : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో టీడీపీ నేత నల్లమిల్లి కి టికెట్ ఇవ్వాలని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందంటే... పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి వెళ్లింది.
దీంతో ఆ సీటు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(Nallamilli Ramakrishna Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నల్లమిల్లిని బుజ్జగించేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగినప్పటికీ లాభం లేకపోయింది. గత మూడు రోజుల నుంచి ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల కార్యచరణలో భాగంగా మహేంద్రవాడ గ్రామం నుంచి ఆయన ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అనపర్తి.
నల్లమిల్లిని బుజ్జగించేందుకు వచ్చిన టీడీపీ నేతలకు గ్రామస్తుల నుంచి నిరసన సెగ ఎదురైంది. దీంతో ఈ విషయాన్ని చంద్రబాబు(Chandrababu) దృష్టికి తీసుకుని వెళ్తామని వెనుదిరిగి వెళ్లిపోయిన టీడీపీ నేతలు. దీంతో నల్లమిల్లి తన తల్లిని రిక్షాలో ఎక్కించుకుని తండ్రి ఫోటోతో పాదయాత్ర మొదలు పెట్టారు. ఐదు రోజుల పాటు గ్రామంలోనే ఉంటానని ఆయన తెలిపారు.
ఈ క్రమంలో ఆయన తనకి కనిపించిన గ్రామస్థులందరినీ కూడా ఏం చేయమంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలు ఏం చెబితే అదే చేస్తాను అంటున్న నల్లమిల్లి. నన్ను ఎదిరించి గెలిచే ధైర్యం లేకా...వైసీపీ(YCP) ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి బీజేపీ నాయకులు తో కలిసి కుట్రపన్నారని ఆయన ఆరోపించారు.
ఆ క్రమంలోనే నా సీటును తొలగించారని రామకృష్ణారెడ్డి బలమైన ఆరోపణలు చేశారు. ఈ పాదయాత్రలోనే రామకృష్ణారెడ్డి ముందే పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయిన ఇద్దరు కార్యకర్తలు.అనపర్తిలో టీడీపీని భూస్థాపితం చేయడానికే కుట్ర పన్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గెలుపు గుర్రాన్ని పక్కనపెట్టి.. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ గెలవని గుర్రాన్ని.. బరిలో దిచ్చిందని పేర్కొన్నారు.
42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధానికి వెన్నుపోటు పొడిచారు అంటూ కార్యకర్తలు నినాదాలు చేపట్టారు. కార్యకర్తలకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధైర్యం చెబుతుండగా నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. నేడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : ”నో ఎగ్జిట్ పోల్”.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు!