Andhra Pradesh: ఏపీలో ఫస్ట్ తేలే రిజల్ట్ ఆ సీటుదే.. ఏపీ పార్లమెంటు స్థానాల్లో తొలి ఫలితం రాజమండ్రి, నరసాపురంలో రానుంది. అమలాపురం ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. అసెంబ్లీ స్థానాలైన భీమిలి, పాణ్యంలలో ఫలితాలు ఆలస్యంగా రానుండగా.. కొవ్వూరు, నరసాపురంలో ముందుగా తొలి ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది. By B Aravind 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మంగళవారం దేశవ్యాప్తంగా లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేపు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. ఆ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోపే రెగ్యులర్ ఓట్ల లెక్కింపు చేపడతామని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే పార్లమెంటు స్థానాల్లో తొలి ఫలితం రాజమండ్రి, నరసాపురంలో రానుంది. అమలాపురం ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. రాజమండ్రి, నరసాపురంలో కేవలం 13 రౌండ్లలో సుమారు 5 నుంచి 6 గంటల్లో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అమలాపురంలో అత్యధికంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అక్కడ దాదాపు 9 నుంచి 10 గంటల వరకు ఓట్ల లెక్కింపు జరగుతుంది. Also Read: ఏపీలో హై టెన్షన్.. ఆ జిల్లాలో పోలీస్‌పై సస్పెన్షన్ వేటు అసెంబ్లీ స్థానాలైన భీమిలి, పాణ్యంలలో ఫలితాలు ఆలస్యంగా రానుండగా.. కొవ్వూరు, నరసాపురంలో ముందుగా తొలి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. పాణ్యం, భీమిలలో ఏకంగా 26 రౌండ్ల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో.. ఓట్ల లెక్కింపు పూర్తవ్వడానికి దాదాపు 9 నుంచి 10 గంటల సమయం పట్టనుంది. నరసాపురం, కొవ్వూరులో కేవలం 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీంతో ఈ నియోజకవర్గాల్లో 5 గంటల్లోనే తొలి ఫలితం రానుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. Also Read: విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు.. పెనమలూరు పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ #telugu-news #ap-election-counting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి