DGP Tirumala Rao: ఏపీ పోలీసులకు శుభవార్త చెప్పిన డీజీపీ AP: రాష్ట్ర పోలీసులకు డీజీపీ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తామని కీలక ప్రకటన చేశారు. అలాగే పోలీసులు ఉపయోగించే పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. By V.J Reddy 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి DGP Tirumala Rao: ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తాం అని అన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటాం అని అన్నారు. సవరణ చేసిన మూడు నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధానమైన నగరాల్లో మరిన్ని సి.సి.కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు ఉపయోగించే పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తాం అని పేర్కొన్నారు. పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తామని కీలక ప్రకటన చేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం అని అన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించి.. పోలీసు అధికారులతో సమావేశమవుతా అని అన్నారు. Also Read: ఏపీలో 37 మంది ఐపీఎస్‌లు బదిలీ #ap-news #dgp-tirumala-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి