AP Politics: హమాస్‌ ఉగ్రవాదుల్లా చేస్తున్నారు.. నారాయణస్వామి ఫైర్!

ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు టీమ్‌ హమాస్‌ ఉగ్రవాదులు లాగా ప్రవర్తిస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు.

New Update
AP Politics: హమాస్‌ ఉగ్రవాదుల్లా చేస్తున్నారు.. నారాయణస్వామి ఫైర్!

Narayana Swamy: చంద్రబాబుకు బెయిల్‌ రావడంతో ఏపీలో టీడీపీ నేతలు అంతా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. మరోవైపు వైసీపీ (YSRCP) నేతలు టీడీపీ (TDP)పై మండిపడుతున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు బెయిల్ (Chandrababu Bail) ముగిసే సమయానికి గుండె పోటు వచ్చిందని కూడా డ్రామా స్టార్ట్ చేస్తారని ఆయన విమర్శించారు. 'అమ్మా భువనేశ్వరి నిజం గెలవాలంటే నీ తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీని ఏవిధంగా వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడో నువ్వే నిజం చెప్పాలి తల్లి' అని చురకలంటించారు. పదవికాంక్షతో ఔరంగజేబు తన తండ్రిని జైలులో పెడితే.. చంద్రబాబు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ ఫాలోయింగ్‌తో పార్టీని గెలిపించారని ఆయన గుర్తు చేశారు.

 నిజమా..? అబద్ధమా..? అనేది ప్రజలకు చెప్పాలి 

ఆయన ఫాలోయింగ్‌తో గెలిచిన ఎమ్మెల్యేలను కొని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుది మోసం కాదా..? అంటూ ధ్వజమెత్తారు. ఇవన్నీ నిజమా..? అబద్ధమా..? అనేది ప్రజలకు చెప్పాలని నారాయణస్వామి కోరారు. సీఎం జగన్‌(YS Jagan) ప్రజా సంకల్ప యాత్ర చేసి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని నారాయణస్వామి అన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నది చంద్రబాబు ఇది న్యాయమా..? అన్యాయమా..? అనేది భువనేశ్వరి చెప్పాలని ఆయన సవాల్‌ చేశారు. నిజం గెలిచింది కనుకే 2019 ఎన్నికల్లో సీఎం జగన్ ని చేశారన్నారు. అదే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి టీడీపీని భూస్థాపితమైన విషయాన్ని నిజమా అబద్ధమా చెప్పాలని ప్రశ్నించారు. నిజం ఎప్పుడూ గెలవాలని తాను కూడా కోరుకుంటా అని నారాయణ స్వామి అన్నారు.

అవినీతి చేయలేదని వాదించలేదు

చరిత్రను చంద్రబాబు నాశనం చేస్తే, చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్ అని ఆయన అన్నారు. న్యాయస్థానాలను మొదటి నుంచి చంద్రబాబు మేనేజ్ చేస్తూ వచ్చారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం న్యాయస్థానాలు కళ్ళు తెరిచాయి కనుకే చంద్రబాబు (Chandrababu) జైలు జీవితం అనుభవించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాయర్లు ఎవరూ కూడా ఆయన అవినీతి చేయలేదని వాదించలేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని నారాయణ స్వామి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కూడా ఆయనకు బెయిల్ వచ్చిందంటే ఆయన కంటి ఆపరేషన్ కోసమని మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేశారని నారాయణ స్వామి అన్నారు. ఆయన బయటకు వచ్చి సభలు, సమావేశాలు పెట్టుకోమని కాదని ఫైర్‌ అయ్యారు. పచ్చ పత్రికలు, టీవీల్లో నిజాలు రాయడం లేదని మండి పడ్డారు. ఆ పచ్చ పత్రికలు, టీవీలు ఒక కులానికి సంబంధించినవి అని నారాయణ స్వామి ఆరోపించారు. అభివృద్ధి నిరోధక శక్తులుగా టీడీపీ ఉందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశాడో..? ప్రజలకు ఏం చేశాడో..? అభివృద్ధి ఏం చేశాడో..? నిరూపించమనండి నేను రాజకీయాలు వదిలేస్తానని నారాయణ స్వామి సవాల్ విసిరారు.

ఇది కూడా చదవండి: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు