నారా లోకేశ్, అయ్యన్న పాత్రుడికి క్యారెక్టర్ లేదు.... డిప్యూటీ సీఎం ఫైర్...!
టీడీపీపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అల్ల కల్లోలం సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. చివరకు పోలీసులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేశారని మండిడపడ్డారు. టీడీపీ నేతలంతా మానవత్వం లేని మనుషులు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేశ్ కు, అయ్యన్న పాత్రుడికి అసలు క్యారెక్టర్ లేదంటూ మండిపడ్డారు.