Sharmila : సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు షర్మిల. చంద్రబాబు రూ. 2 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్‌ రూ.6.50 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. దోచుకోవడం.. దాచుకోవడమే అని అన్నారు. ఏపీకి ఇప్పటివరకు రాజధాని లేదని పేర్కొన్నారు.

New Update
Sharmila : సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila : ఏపీసీసీ(APCC) చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు వైఎస్ షర్మిల(YS Sharmila). ఏఐసీసీ ఇచ్చిన నియామక పత్రాన్ని షర్మిలకు అందించారు మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి. కాసేపట్లో షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ కార్యవర్గ సమావేశం కానుంది. అధ్యక్ష పగ్గాలు చేజిక్కించుకున్న షర్మిల వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు.

ALSO READ: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా?

రూ. 10 లక్షల కోట్లు అప్పులు..

గత పదేళ్లుగా టీడీపీ, వైసీపీ(YCP) పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందా? అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు(Chandrababu) రూ. 2 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్‌(Jagan) రూ.6.50 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. మొత్తంగా రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 10 ఏళ్లలో పది పరిశ్రమలైనా వచ్చాయా? అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. దోచుకోవడం.. దాచుకోవడమే అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ షర్మిల వ్యాఖ్యానించారు.

రోడ్లు వేసేందుకు పైసల్ లేవు..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వద్ద రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక, మైనింగ్ మాఫియా కనిపిస్తుందని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా చేశారని అన్నారు.

ప్రత్యేక హోదాలో విఫలం..

ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో చంద్రబాబు, జగన్ విఫలం అయ్యారని అన్నారు షర్మిల. ఈ పదేళ్లలో ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చారు అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం చంద్రబాబు, జగన్ దే అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చేవని అన్నారు.

రాజధాని లేని రాష్ట్రం...

టీడీపీ, వైసీపీ పార్టీలు కలిసి ఏపీకి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు షర్మిల. రాజధాని విషయంలో టీడీపీ అబూత కల్పనలు కల్పించిందని అన్నారు. మూడు రోజుల అంటూ జగన్ రెడ్డి మాయమాటలు చెప్పాడుని ఫైర్ అయ్యారు. పోలవరం రాజశేఖర్ రెడ్డి కల అని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి ఇద్దరూ బీజేపీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఏపీలో అప్పు లేని రైతు ఉన్నాడా? అని ఆమె ప్రశ్నించారు. రైతన్న కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

DO WATCH:

Advertisment
తాజా కథనాలు