YS Sharmila: నీకు దమ్ముందా?... సీఎం జగన్‌కు షర్మిల సవాల్

సీఎం జగన్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే... వారసుడు గా చెప్పుకొనే జగన్ అన్న 6 వేలతో వేసింది "దగా డీఎస్సీ" అని విమర్శలు చేశారు.

YS Sharmila: నీకు దమ్ముందా?... సీఎం జగన్‌కు షర్మిల సవాల్
New Update

YS Sharmila: మరి కొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ (AP Assembly Elections) ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వైసీపీ (YCP) అధిష్టానం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ (AP Congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ (Mega DSC) వేస్తే... వారసుడు గా చెప్పుకొనే జగన్ (CM Jagan) అన్న 6 వేలతో వేసింది "దగా డీఎస్సీ" అని విమర్శలు చేశారు.

Also Read: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి మరో నేత?

ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే YCP నాయకులు.. వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ సవాల్ విసిరారు.

1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ?

2. 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ?

3. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి ?

4. టెట్,డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ?

5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్ కి 20 రోజులు,తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధి నా?

6.YSR హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా ?

7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ?

8. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ?

9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా?

నవ రత్నాలు,జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ అన్న.. ఆయన చుట్టూ ఉండే సకల శాఖల మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

DO WATCH:

#ys-sharmila #cm-jagan #ap-dsc-notification-2024 #mega-dsc #ap-latest-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe