AP Congress Called for Chalo Secretariat: ఆంధ్రాలో ప్రస్తుతం వాతావరణం చాలా వేడీ వేడిగా ఉంది. చలో సెక్రటేరియట్ అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) పిలుపునివ్వడంతో అక్కడ అంతా టెన్షన్ నెలకొంది. చలో సెక్రటేరియట్ కోసం నిన్న రాత్రే విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్చేరుకున్న షర్మిల అక్కడే నిదురించారు. ఆమెతో పాటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తులు కూడా అక్కడే పడుకున్నారు. దీంతో అక్కడకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాంగ్రె నేతలు మస్తాన్ వలీ, రుద్రరాజుతో పాటూ మరి కొంత మంది నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
మాకు నిరసన తెలిపే హక్కు లేదా..
ఇక మరోవైపు ప్రభుత్వం మెగా డీఎస్సీ (Mega DSC) ఇస్తానని మోసం చేసిందని ఆరోపిస్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి. నిరుద్యోగుల తరుపున నిలబడతామని అంటున్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా.. నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా అంటూ షర్మిల అడుతున్నారు. మేము తీవ్రవాదులమా..లేక సంఘ విద్రోహ శక్తులమా...మా పట్ల ఏ మిటీ ప్రవర్తన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే...మాకు భయపడుతున్నట్లే కదా అర్థం అని అంటున్నారు. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం అన్నారు. మమ్మల్ని ఆపాలని చూసినా,ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా..బారికెడ్లతో బంధించినా..మా పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు షర్మిల.
Also Read: Crime: : ఇంట్లోనే నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం..అధిక రక్తస్రావంతో తల్లీబిడ్డ మృతి!