Andhra Pradesh: రేపటిలోగా మంత్రులకు శాఖల కేటాయింపు-చంద్రబాబు

ఆంధ్రరాష్ట్రం పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రుల అభీష్టాలు, సమర్థతను బట్టి వారికి రేపటిలోగా శాఖలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తాడేపల్లిలోని తన నివాసంలో మంత్రులతో సమావేశం అయ్యారు.

New Update
Andhra Pradesh: రేపటిలోగా మంత్రులకు శాఖల కేటాయింపు-చంద్రబాబు

AP CM Meeting With Ministers: ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో మంత్రులతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలన్నింటినీ బాగు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రులదే అని బాబు స్పష్టం చేశారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని..వైసీపీ మంత్రుల దగ్గర పని చేసిన వారిని తిరిగి చేర్చుకోవద్దని సూచించారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్థత మేరకే రేపటిలోగా శాఖలను కేటాయిస్తామని చెప్పారు. ఇచ్చిన శాఖకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదే అన్నారు. శాఖలవారీగా శ్వేతపత్రాలను విడుదల చేసి ప్రజల ముందు ఉంచుదాం అంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం బాబు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల బాగోగులు చూడాలని, వారికి మూలు కలిగేలా పని చేయాలని చెప్పారు.

రేపటి నుంచే బాధ్యతలు..

ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పుడే మంత్రుల బాధ్యతలను కూడా కేటాయిస్తారని తెలుస్తోంది. ఇక సీఎంగా తన మొదటి సంతకాన్ని బాబు మెగా డీఎస్సీ పై చేయనున్నారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడో సంతకం వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు పెంపు, 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ పై ఉండనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా రేపు చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ మీద చేయనున్నారు.

Also Read:AP CM Chandrababu: రేపు సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!

Advertisment
తాజా కథనాలు