AP CM Jagan Speech: ఏ ఒక్క ఉద్యోగికి తమ ప్రభుత్వం అన్యాయం చేయలేదు: సీఎం జగన్

ట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో గత ప్రభుత్వం జీతాలు ఎన్నికల సమయంలో పెంచిందని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్. సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీవో మహా సభల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సమస్యలు వస్తాయని వారించినా తాము వెనకడుగు వేయలేదని అన్నారు. తాము నిజాయితీ, కమిట్మెంట్ తో అడుగులు వేశామన్నారు సీఎం. అలాగే పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచామన్నారు.

CM Jagan Delhi Tour: ఒక రోజు ముందుగానే ఢిల్లీకి జగన్.. ముందస్తు ఎన్నికల కోసమేనా?
New Update

AP CM Jagan speech in APNGO Public Meeting about Govt Employees: ఓట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో గత ప్రభుత్వం జీతాలు ఎన్నికల సమయంలో పెంచిందని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్. సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీవో మహా సభల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సమస్యలు వస్తాయని వారించినా తాము వెనకడుగు వేయలేదని అన్నారు. తాము నిజాయితీ, కమిట్మెంట్ తో అడుగులు వేశామన్నారు సీఎం. గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు వరకూ ఒక్క రూపాయి కూడా జీతం పెరగని వారికి ఈ ప్రభుత్వంలో జీతాలు పెంచామని అన్నారు. అలాగే పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచామన్నారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బ్రతికించాం:

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బ్రతికించి, 55వేల ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజ్ చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. 1998-2008 డీఎస్సీ అభ్యర్ధులకు న్యాయం చేస్తూ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సేవాఫలాలు ప్రజలకు తీసుకెళ్ళడంలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఉద్యోగులేనని కొనియాడారు. పాలసీలు చేసేది ప్రభుత్వమైతే, అమలు చేసేది మాత్రం ఉద్యోగులేనని పేర్కొన్నారు సీఎం జగన్. తమ ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం చేయలేదన్నారు. ఉద్యోగులందరికీ తోడుగా నిలబడ్డామని, ప్రభుత్వ ఉద్యోగులపై మమకారం ఉన్న ప్రభుత్వం తమదని సీఎం అన్నారు. ఉద్యోగుల సంతోషం, భవిష్యత్తు తమ ప్రభుత్వ ప్రాధాన్యత, తన బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వ కుటుంబంలో కీలక సభ్యులు ఉద్యోగులని తెలిపారు. గ్రామ స్ధాయిలోనే సేవలు అందుబాటులోకి తెస్తూ.. 1.35 లక్షల శాశ్వత ఉద్యోగాలు ప్రారంభంలోనే ఇచ్చామని అన్నారు ముఖ్యమంత్రి జగన్.

గడ్డుకాలం వచ్చినా.. పేదలను ఈ ప్రభుత్వం వదిలేయలేదు:

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా.. కొవిడ్ కాలంలో పేదలను బ్రతికించుకున్నామన్నారు. డీబీటీ ద్వారా ప్రజలకు సరాసరి లంచాలకు, వివక్షకు తావివ్వకుండా సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ఎవరూ ఊహించని గడ్డుకాలం వచ్చినా.. ఈ ప్రభుత్వం వదిలేయలేదన్నారు. గ్రామ స్థాయిలోనే ఇంగ్లీషు మీడియం బడులన్నాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవోను కొంత మార్పు చేసి 2014 జూన్ కటాఫ్‌ ను తొలగించామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు మంచి చేశామని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.

గత ప్రభుత్వాలు గాలికి వదిలేసిన జీపీఎస్ సమస్య మీద మనసు పెట్టి నిజాయితీగా అడుగులు వేశామని అన్నారు. ఎంతో అధ్యయనం తరువాత జీపీఎస్ తీసుకొచ్చామని.. మాట తప్పే ఉద్దేశం లేదు కాబట్టే జీపీఎస్ తెచ్చామన్నారు. జీపీఎస్ విషయంలో చాలా సమయం కేటాయించి మంచి పరిష్కారం ఇచ్చామని.. దేశంలోనే ఈ జీపీఎస్ అమలు చేసే పరిస్ధితి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్. ప్రభుత్వ రంగాన్ని మూసివేయడంలో, వీఆర్ ఇవ్వకపోవడంలో, గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటూ ఉద్యోగులను ఇంటికి పంపడంలో.. గత ప్రభుత్వ రికార్డ్ అని దుయ్యబట్టారు. చంద్రబాబు రాసిన మనసులో మాట పుస్తకం ఉద్యోగులందరూ ఓసారి చదవాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు 2.70 లక్షల్లో.. 1.09 లక్షల ఉద్యోగులు అదనంగా ఉన్నారని తేలాయని చంద్రబాబు తమ పుస్తకంలో రాశారన్నారు.

కొత్త ఉద్యోగాలు కల్పించకూడదని చంద్రబాబు మనసులో మాట రాసుకున్నాడని.. ప్రభుత్వ ఉద్యోగుల్లో 60%కి పైగా అవినీతిపరులే ఉన్నారని పేర్కొన్నాడని చెప్పారు. ఉద్యోగులపై స్వయంగా లంచగొండి వారని రాసేస్తే.. చంద్రబాబు ఉద్యోగులకు మంచి చేయగలడా అనేది ఆలోచించుకోవాలన్నారు. 9 ఏళ్ళ పాటు 54 ప్రభుత్వరంగ సంస్ధలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల పరిస్థితి చంద్రబాబు హయాంలో ఏమైందో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు.

చంద్రబాబు, దత్తపుత్రుడు, మిగిలిన వారందరికీ తనపై కడుపు మంట మాత్రమే ఉందని.. వాళ్ళు చేసే రాజకీయ విమర్శలు, రెచ్చగొట్టే మాటలు, నిందలు, కట్టుకధలను నమ్మొద్దని ప్రజల్ని కోరారు. అంగళ్ళులో పోలీసుల మీద దాడి చేసి, ఒక పోలీసు కన్ను పోగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిచ్చిన దారిలో వెళ్లకుండా.. పోలీసుల మీద దాడి చేసి, శవరాజకీయాలు చేయడానికి కూడా చంద్రబాబు వెనకాడలేదని మండిపడ్డారు. జూలై 2022 డీఏను దసరా పండుగనాడు ఇస్తున్నామని.. మెడికల్ డిపార్ట్మెంట్ మాదిరిగా అడిషనల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తున్నామని శుభవార్త చెప్పారు సీఎం జగన్.

#andhra-pradesh #cm-jagan #ap-cm-jagan #govt-employees #apngo-public-meeting-x #apngo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe