CM Jagan: కాంగ్రెస్ నా కుటుంబాన్ని విభజించింది.. ఇండియా టూడే సమ్మిట్‌లో సీఎం జగన్‌

విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో మార్పులు తీసుకొచ్చామన్న సీఎం రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో మాట్లాడారు. ఎలాంటి వివక్ష, అవినీతి లేకుండా అర్హత గలవారికి సంక్షేమ పథకాలు అందించామన్నారు.

New Update
YCP MP Final List: వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ ఫైనల్‌ చేసిన అధిష్టానం! ఎవరెవరున్నారంటే..?

CM Jagan Comments On Congress Party: తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో (India Today Education Summit) ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో మార్పులు తీసుకొచ్చామన్న సీఎం రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి వివక్ష, అవినీతి లేకుండా అర్హత గలవారికి సంక్షేమ పథకాలు అందించామని.. మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై (Congress Party) కూడా ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకుంటుందని విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్లే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారంటూ వ్యాఖ్యానించారు.

విపక్షాలు పథకాల గురించి మాట్లాడవు

'మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను. ఇదే మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత. ప్రతి 2వేల జనాభాకు ఓ గ్రామ సచివాలయాన్ని నిర్మించాం. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో విషయాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు సంక్షేమ పథకాల (AP Schemes) గురించి.. వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు. ఇదే బడ్జెట్‌ గతంలో కూడా ఉంది..ఇప్పుడూ కూడా ఉంది. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు.

Also Read: టీడీపీకి ఎంపీ గల్లా జయదేవ్‌ గుడ్‌బై!

చంద్రబాబుపై నాకెందుకు ప్రతీకారం

చంద్రబాబు (Chandrababu) విషయంలో నాకు ప్రతీకారం లేదు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు కోర్టుకు చేరాయి. ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు రిమాండ్‌ విధించింది. అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది. సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా. వాటిని చూసి నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ఉనికి పెద్దగా లేదు. రాష్ట్రంలో పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే జరుగుతుంది.

కాంగ్రెస్ మా కుటుంబాన్ని విభజించింది

మా ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. కొంతమంది స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది. చివరి దశలో మార్పులు చేసి గందరగోళం సృష్టించే కన్నా.. ముందుగానే నిర్ణయిస్తున్నాం. కాంగ్రెస్‌ ఎప్పుడూ డర్టీ గేమ్‌ ఆడుతూ ఉంటుంది. ఏపీని అన్యాయంగా విభజించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి పాలన చేయాలనుకుంది. మా కుటుంబాన్ని కూడా అలానే విభజించారు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయినప్పుడు.. గతంలో మా చిన్నాన్నకు మంత్రి పదివి ఇచ్చారు. ఆ తర్వాత మాకు పోటీగా బరిలోకి దింపారు. వాళ్లు పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి అప్పగించారు. కానీ దేవుడే అధికారం ఇస్తాడు. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు.

పేదరిక నిర్మూలనకు చదువే మార్గం

పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. నాయకులు వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు. పేదరికాన్ని తొలగించాలంటే చదువుపై పెట్టుబడి పెట్టడం తప్ప మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం బోధించకూడదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను విమర్శించేముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి. పేదలు తెలుగు మీడియం చదివితే.. ధనిక పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. నాణ్యమైన విద్య ప్రతీ ఒక్కరి హక్కు కావాలి అంటూ సీఎం జగన్ మాట్లాడారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు