Andhra Pradesh : ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా.. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఫోకస్

రెండోసారి అధికారం సాధించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ టార్గెట్ గా కసరత్తులు చేస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టుసాధిస్తే మెజారిటీ వచ్చినట్టేనని భావిస్తోంది. ఈ క్రమంలో జగన్ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు.

New Update
Andhra Pradesh : ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా.. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఫోకస్

CM Jagan Meeting With Uttarandhra Leaders : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో రాజకీయంగా ఉత్తరాంధ్ర(Uttarandhra) బాగా ప్రాబల్యం ఉన్న ప్రదేశం. అందుకే ఎన్నికల్లో ఇక్కడ ఎలా అయినా గెలవాలని అనుకుంటున్నారు సీఎం జగన్(CM Jagan). అందులో భాగంగానే ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలో ఎలా అయినా గెలిచి మెజారిటీ సాధించాలని వైసీపీ(YCP) భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నేతలతో జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటున్నారు ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు.ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించి మాట్లాడ్డానికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా(Srikakulam) నేతలతో సమావేశం అవుతున్నారు.సమావేశానికి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రలో ఐదేళ్ల కాలంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలి అనే అంశంపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నారు జగన్.

11వ లిస్ట్...
మరోవైపు వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల 11 వ జాబితా ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌ లో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. రెండు పార్లమెంట్‌, ఒక అసెంబ్లీ స్థానానికి ఇన్ ఛార్జ్‌ లను వైసీపీ ప్రకటించింది.కర్నూలు(Kurnool) పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌ ఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌ చార్జీగా రాజోలు ఎమ్మెల్యే, జనసేన నేత రాపాక వరప్రసాద్‌ ను నియమించింది. అలాగే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ ఛార్జీగా కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును సీఎం జగన్ ఎంపిక చేశారు.

ముందు కర్నూలు పార్లమెంట్‌(Kurnool Parliament) నియోజకవర్గ ఇన్‌ ఛార్జీగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanuru Jayaram) ను వైసీపీ నియమించింది. అయితే ఆలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానంటూ గుమ్మనూరు పట్టుబట్టడంతో వైసీపీ దానికి నో అని చెప్పింది. దీంతో జయరాం పార్టీని విడిచిపెట్టారు. ఆయన టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి పోటీలో నిలిచేందుకు సిద్దంగా ఉన్నారు.

దీంతో ఆయన స్థానంలో బీవై రామయ్యను కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ ఛార్జీగా వైసీపీ ఎంపిక చేసింది. కొద్ది రోజుల క్రితమే పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు జగన్‌ అవకాశం ఇచ్చారు. రాజోలు అసెంబ్లీ ఇన్‌ ఛార్జీగా గొల్లపల్లిని వైసీపీ నియమించింది. రాపాకను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు ఇచ్చారు.

Also Read : Movies: కాంతారాలో జూనియర్..కన్నడలో వైరల్ అవుతున్న న్యూస్

Advertisment
తాజా కథనాలు