ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కూనవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులకు ముఖ్యమంత్రి భరోసా అందిస్తున్నారు. అలాగే వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అధికారుల పని తీరు ఎలా ఉంది? మీకు సహాయాలు అందుతున్నాయా? మీ పరిస్థితి ఎలా ఉంది? అని స్థానికులను క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్.
పూర్తిగా చదవండి..వరదల్లో ఎస్ఐ సాహసోపేత రెస్య్కూ ఆపరేషన్.. మెడల్ కి సిఫార్సు చేసిన ఏపీ సీఎం
స్థానిక ఎస్ఐ వెంకటేష్ రెస్క్యూ ఆపరేషన్ సాహసోపేతంగా నిర్వహించారని, గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలక పాత్ర పోషించారని సీఎం ఎదుటే స్థానికులు మెచ్చుకున్నారు. చాలా మంది ప్రాణాలను ఎస్ఐ కాపాడాలరని కొనియాడారు. స్థానికుల స్పందనతో సమానంగా సీఎం జగన్ కూడా స్పందించారు. గత ఏడాది, ఈ ఏడాది వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్యూ ఆపరేషన్స్ నిర్వహించిన కూనవరం ఎస్ఐను ముఖ్యమంత్రి అభినందించారు.
Translate this News: