AP Capital Shifting :విశాఖకు రాజధాని...సంచలన జీవో జారీ

విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతి కల్పన కోసం ప్రత్యేక కమిటీ వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని సమీక్షించే క్రమంలో ముఖ్యమంత్రి విశాఖలోనే స్పష్టం చేశారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

AP Capital Shifting :విశాఖకు రాజధాని...సంచలన జీవో జారీ
New Update

AP Capital Shifting to Vizag: ఆంధ్ర ప్రభుత్వం విశాఖకు తరలిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దీనికి సంబంధించి విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం (CM Camp Office), మంత్రులకు వసతి కల్పన కోసం ప్రత్యేక కమిటీ వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో (GO) జారీ చేసింది. దీనిలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని సమీక్షించే క్రమంలో ముఖ్యమంత్రి విశాఖలోనే (Vishaka) ఉంటారని స్పష్టం చేశారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అధికారుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో పట్ణాభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించి జీవో 2015ను సీఎస్ జారీ చేశారు. ఇప్పటికే విశాఖలో రెండు రోజులుగా డీజీపీ పర్యటన చేస్తున్నారు. అక్కడ సీఎం కార్యాలయం పనులు పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. నిన్న 6 నూతన జిల్లాల ఎస్పీలతో డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఇంతకు ముందే సీఎం జగన్ వైజాగ్ (Vizag)వెళ్ళడం, పాలనా కార్యాలయం ఎక్కడ ఉండాలో నిర్ణయించడం లాంటివి జరిగాయి. దాని తర్వాత వైజాగ్ లోని రుషికొండలో సీఎం ఆఫీస్ కట్టడం కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే నెల 15 కు కార్యాలయం మొత్తం నిర్మాణ పనులు పూర్తయిపోతాయని తెలుస్తోంది. దాన తరువాత అక్టోబర్ 22న సీఎం జగన్ (CM Jagan) వైజాగ్ వెళ్ళనున్నారు. తరువాతి రోజు అక్టోబర్ 23 న సీఎం కొత్త కార్యాలయంలో అడుగు పెట్టేందుకు ముహూర్తం ఖరారు అయిందని సమాచారం. అప్పటి నుంచి జగన్ వైజాగ్ నుంచి పాలనా కార్యక్రమాలు మొదలుపెడతారని చెబుతున్నాయి వైసీపీ (YSRCP) వర్గాలు.

దసరా తరువాత విశాఖకు షిఫ్ట్ అవుతానని రీసెంట్ గా ప్రకటించారు జగన్. రుషికొండలో (Rushikonda) ప్రభుత్వ కార్యాలయాల కోసం నాలుగు బ్లాక్‌లు ఉండేలా భవనాన్ని నిర్మించారు. ఇందులో ఒక బ్లాక్‌ను సీఎంవోకు ఉపయోగించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఇంటీరియర్ పనులు మిగిలున్నాయి. ఇక ఏపీఎస్సీ బెటాలియన్ అవుట్ పోస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. అక్టోబర్ 24 నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలోనే ఉంటారని అధికారులు చెబుతున్నారు.

Also Read:చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌పై నేడు తీర్పు

#andhra-pradesh #jagan #visakha #ap-capital #ap-cm-camp-office
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe