YS Sharmila: ఇకపై జగన్‌ను అలానే పిలుస్తా.. షర్మిల కౌంటర్

ఏపీ సీఎం జగన్ కు ఇప్పటి నుంచి జగన్ అన్నగారు అని పిలుస్తానని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. అధికారంలో ఉన్న వైసీపీ ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ, టీడీపీలు బీజేపీకి జపం చేస్తున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే వస్తుందన్నారు.

YS Sharmila: నీకు దమ్ముందా?... సీఎం జగన్‌కు షర్మిల సవాల్
New Update

APCC Chief YS Sharmila: ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ పర్యటనలో సీఎం జగన్ పై చురకలు అంటించారు. షర్మిల.. సీఎం జగన్ ను జగన్ రెడ్డి అని అనడం తనకు నచ్చలేదు అంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి నుంచి జగన్‌ అన్న గారు అనే అంటా అని సెటైర్లు వేశారు షర్మిల. అభివృద్ధి చూపిస్తానని సుబ్బారెడ్డి తనకు సవాల్‌ విసిరారని అన్నారు. 'సరే సార్‌.. మీరు చేసిన అభివృద్ధి చూపించండి.. మీరు చేసిన అభివృద్ధి చూడటానికి నేను సిద్ధం' అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా?

అనంతరం విజయనగరం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా షర్మిల పాల్గొన్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలపై విమర్శలు దాడికి దిగారు. షర్మిల మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఇంకోలా వుండేదని అన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో TDP, YCP లు మోసం చేశాయని పేర్కొన్నారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన చంద్రబాబు అధికారంలో వచ్చాక మర్చిపోయారని అన్నారు.

హోదా అడిగితే జైల్లో.. 

ఏపీకి ప్రత్యేక హోదా అడిగితే జైల్లో పెట్టించారని మండిపడ్డారు షర్మిల. ఇక జగన్మోహన్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 25 ఎంపీ లు ఇస్తే హోదా తెస్తా అన్నారని పేర్కొన్నారు. జగన్ అన్న గారు అధికారంలో వచ్చాక స్వలాభం కోసం చూశారని ఆరోపించారు. ఈ 5 ఏళ్లలో ఒక్క సారి కూడా హోదా పై జగన్ అన్న గారు ఉద్యమం చేసింది లేదు అని మండిపడ్డారు.

ఎన్నో పరిశ్రమలు వచ్చేవి..

ఏపీకి హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవని అన్నారు షర్మిల. జగన్ అన్న గారు అధికారంలో వచ్చాకా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నాడని.. నాలుగున్నర ఏళ్లు మోసం చేసి ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ లు అంటున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు నోటిఫికేషన్ లు ఇస్తే ఉద్యోగాలు వచ్చేవి ఎన్నడు జగన్ సార్? అని షర్మిల ప్రశ్నించారు.

నాకు బాధ కలిగింది..

శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం చేసినట్లు షర్మిల తెలిపారు. మహిళలు చెప్పిన సమాధానం చూస్తే బాధ కలిగిందని... మద్య నిషేదం అని చెప్పి ఎక్కడ చూసినా మద్యం దొరుకుతుందని అన్నారు. రెట్లు పెంచారు...పేదల ఇళ్లను మరింత గుల్ల చేశారని ఫైర్ అయ్యారు. మద్య నిషేదం చేయక పోతే ఓట్లు కూడా అడగను అన్నారు.. మరి ఎక్కడ పోయే మద్య నిషేదం జగన్ అన్న గారు? అని చురకలు అంటించారు.

బీజేపీ కి టీడీపీ, వైసీపీ బానిసలు..

పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా టీడీపీ, వైసీపీ పార్టీలు వదిలేశాయని ఫైర్ అయ్యారు షర్మిల. అభివృద్ధి పక్కన పెట్టీ TDP, YCP లు బీజేపీ జపం చేస్తున్నాయని అన్నారు. బీజేపీకి రెండు పార్టీలు బానిసలు గా మారాయని ఆరోపించారు. బీజేపీ వద్దని ఆంధ్ర రాష్ట్రం తిరస్కరిస్తే... వీళ్ళు మాత్రం బీజేపీ తో దోస్తీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ కి పూర్తిగా అమ్ముడు పోయారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రత్యేక హోదా..

రాష్ట్రం పై చిత్తశుద్ది ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అని అన్నారు షర్మిల. రాహుల్ గాంధీ ఇప్పటికే హామీ ఇచ్చారని.. కేంద్రంలో అధికారంలో వస్తె ప్రత్యేక హోదా పై మొదటి సంతకం చేస్తామని అన్నారని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రత్యేక హోదా తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యం లా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

DO WATCH:

#ap-elections-2024 #ys-sharmila #cm-jagan #ap-latest-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe