AP Cabinet Meeting: ఎల్లుండే ఏపీ కేబినెట్ తొలి భేటీ.. మహిళలకు అదిరిపోయే శుభవార్త!?

ఏపీ రాష్ట్ర మహిళలకు టీడీపీ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. జూన్ 24న జరిగే మొదటి మంత్రివర్గ సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కమిటీ నివేదిక సమర్పించిన నెలరోజుల్లోనే ఫ్రీ బస్సు జర్నీ మొదలుకానున్నట్లు సమాచారం.

New Update
AP Cabinet Meeting: ఎల్లుండే ఏపీ కేబినెట్ తొలి భేటీ.. మహిళలకు అదిరిపోయే శుభవార్త!?

AP Free Bus: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన టీడీపీ (TDP) ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు త్వరలోనే భారీ శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. మహిళలకు ఫ్రీ బస్సు వసతి కల్పించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే నూతన మంత్రివర్గం జూన్ 24న తొలిసారి భేటీ కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుతో (Polavaram Project) పాటు ఉచిత హామీలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎనిమిది శ్వేతపత్రాలు విడుదల చేయాలని టీడీపీ కూటమి నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితవర్గాల సమాచారం.

నెలరోజుల్లో అమలు చేస్తాం..
ఇటీవల ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెలరోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. 15 రోజుల్లోగా కమిటీని వేసి, పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం జరుపుతామన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం నెలరోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని అన్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 5 కీలక ఫైళ్లు.. మెగా డీఎస్సీ (Mega DSC), అన్నక్యాంటీన్లు, సామాజిక పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: నా బిడ్డను కిడ్నాప్ చేశారన్న.. మహిళ ఫిర్యాదుతో పవన్ ఏం చేశారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు