YCP MLA: నందికొట్కూరు (Nandikotkur) వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (YSRCP MLA Arthur) భావోద్వేగానికి లోనయ్యారు. కర్నూలులో ఎమ్మెల్యే (Kurnool MLA) మనవడి బర్త్‌డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు భారీగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ALSO READ: రూ.500 కోసం ఆత్మహత్య చేసుకున్న దంపతులు
ఆ అనుబంధాన్ని మరువను..
ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌తో (Y.S. Rajashekar Reddy) ఉన్న అనుబంధాన్ని ఎన్నటికీ మరువలేనన్నారు. తాను ఎమ్మెల్యేగా అయ్యాక నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నాలుగు సార్లు తిరిగానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా సమాయంతో అందరు బయపడి ఇంట్లో ఉంటే తాను మాత్రం కరోనా సమయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని తెలిపారు.
ఎన్నో బాధలు అనుభవించా..
ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వైసీపీ వచ్చి తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ ఐదేళ్లల్లో ఎన్నో బాధలు అనుభవించా అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆర్థర్. బాధల్లో తన వెంట వైఎస్సార్ కుటుంబం నడిచింది అని అన్నారు. తనను కొంతమంది ఎన్నో ఇబ్బందులు పెట్టాలని ఎమ్మెల్యే ఆర్థర్ పేర్కొన్నారు. తాను ఎక్కడ కూర్చున్నా ఎమ్మెల్యేనే అంటూ ఆర్థర్ భావోద్వేగం గురైయ్యారు.
రాజీనామా చేయండి...
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ను సొంత పార్టీ కార్యకర్తలే షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆర్థర్ ను రాజీనామా చేయాలని కార్యకర్తలు, నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. సాయంకాలం లోపు రాజీనామా చేయాలని అర్ధర్ ను నాయకులు కోరుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఆర్థర్ ఎలా స్పందిస్తారో చూడాలి. వైసీపీ కి రాజీనామా చేస్తారా లేదా ఆపార్టీలోని కొనసాగుతారా? అనేది వేచి చూడాలి.
ALSO READ: ప్రధాని మోడీ దర్శించిన రామకాలం నాటి ఆలయాలు ఇవే
DO WATCH: