Lok Sabha Elections: ఓట్ల పండుగతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ నగరం మూగబోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు సొంత ఊర్లకు పయనమయ్యారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. తమకు నచ్చిన నాయకుడిని గెలిపించేందుకు ప్రజలు పల్లె బాట పట్టారు. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో హైదరాబాద్ నగరంలోని ఆంధ్రవాసులు సొంత ఊర్లకు బయలు దేరారు.
శనివారం, ఆదివారం, సోమవారం మొత్తం మూడు రోజులు సెలవులు.. అలాగే పిల్లలకు ఎండాకాలం సెలవులు కావడంతో కుటుంబాలతో తన సొంత ఊర్లకు వెళ్లారు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్లు అన్ని కిటకిటలాడుతున్నాయి. కాగా రద్దీ ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డ.. ఎన్నికల కావడంతో ఓటు వేసేందుకు ప్రజలు రద్దీని, ఇబ్బందిని పక్కకు పెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రెడీ అయ్యారు.