AP Assembly Sessions : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేయనన్నారు. సభలో వైసీపీ వ్యూహం ఏంటన్న దానిపై ఆసక్తి నెలకొంది. మూడు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను రాష్ట్ర సర్కార్‌ ప్రవేశపెట్టనుంది.

New Update
AP Assembly Sessions : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

AP Assembly Monsoon Sessions : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేయనన్నారు. సభలో వైసీపీ (YCP) వ్యూహం ఏంటన్న దానిపై ఆసక్తి నెలకొంది. వైసీపీ హెచ్చరికల నేపథ్యంలో ముందే మార్షల్స్‌తో భద్రత ఏర్పాటు చేశారు. గవ­ర్నర్‌ ప్రసంగం అనంతరం స్పీకర్‌ అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశం జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై ఈ భేటీలో స్పష్టత రానుంది. మూడు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ (Vote On Account Budget) ను రాష్ట్ర సర్కార్‌ ప్రవేశపెట్టనుంది. అలాగే మూడు శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు టీడీఎల్పీ (TDLP) భేటీ జరగనుంది.

Also Read: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు