Ear Tips : చెవి(Ear) ని శుభ్రపరచడం పట్ల ప్రజలు తరచుగా అజాగ్రత్తగా ఉంటారు. చెవిని సరిగా శుభ్రంగా చేసుకోకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు(Health Diseases) వస్తాయని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు మన చెవిని శుభ్రం చేయడానికి అగ్గిపుల్లలు లేదా కాటన్ బడ్స్(Cotton Buds) వంటి వాటిని వాడుతూ ఉంటాం. కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు(Doctors) అంటున్నారు. చెవులు చాలా సున్నితమైన అవయవం. కాబట్టి వాటిని శుభ్రం చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ శరీరం యొక్క పరిశుభ్రత గురించి శ్రద్ధ వహిస్తారు, కానీ ప్రజలు కొన్ని శరీర భాగాల గురించి అజాగ్రత్తగా ఉంటారు. శరీరంలోని ఇతర భాగాల్లా చెవిని శుభ్రపరచడం కూడా చాలా ముఖ్యం. తరచుగా చాలా మందికి వినికిడి లోపం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు చిన్ననాటి నుంచి లేదా కొన్నిసార్లు పెరుగుతున్న వయస్సులో అజాగ్రత్తగా ఉండటం వల్ల వస్తాయి. చెవిలో గులిమి పేరుకుపోవడం సాధారణ విషయమే. ఇది బ్యాక్టీరియా మన చెవిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అయితే దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. కానీ గులిమి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : Guava Chutney: జామకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా..ఎన్ని లాభాలో తెలుసా?
నూనె వాడటం:
- నూనె వాడకం చెవులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం కొద్దిగా ఆవాలు, బాదం లేదా కొబ్బరి నూనెను వేడి చేసి రాత్రిపూట మీ చెవుల్లో ఉంచి కొన్ని నిమిషాలు అలాగే ఉంచవచ్చు. ఈ నూనెతో చెవిలో గులిమి కరిగి తేలికగా బయటకు వస్తుంది.
ఆపిల్ వెనిగర్:
- కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్(Apple Sider Vinegar) తీసుకుని కొంచెం నీటిలో కరిగించి చెవిలో వేసుకోవచ్చు. ఇది చెవిలో కొంత సమయం ఉన్న తర్వాత చెవి నుంచి గులిమి మొత్తం బయటికి వస్తుంది. అయితే దీనిని ఉపయోగించే ముందు, డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
చిన్న పిల్లల నూనె:
- ఇయర్‌వాక్స్(Ear Walks) ను శుభ్రం చేయడానికి బేబీ ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. కొన్ని చుక్కల బేబీ ఆయిల్‌ను చెవుల్లో ఉంచి కాటన్ సహాయంతో మూసివేసి, 5 నిమిషాల తర్వాత కాటన్‌ను తీసేయాలి. దాంతో ఇయర్‌వాక్స్ ఆటోమేటిక్‌గా బయటకు వస్తుంది.
వంట సోడా:
మీరు బేకింగ్ సోడా ఉపయోగించి కూడా చెవులు శుభ్రం చేయవచ్చు. చిటికెడు బేకింగ్ సోడాను అరగ్లాసు నీటిలో కలపాలి. ఇప్పుడు దానిని డ్రాపర్ సహాయంతో చెవిలో వేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మీ తలను ఒక వైపుకు వంచండి. ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకుని చెవిలో గులిమి, నీరు రెండింటినీ శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల గులిమితో పాటు మీ చెవి కూడా శుభ్రం అవుతుంది.
ఇది కూడా చదవండి: ఆఫీసు పనితో అలసిపోతే ఇలా సింపుల్‌గా రీచార్జ్ అవ్వండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.