Anupama Parameswaran : అనుపమకి అలాంటి మసాజ్ కావాలంట.. ఫోటో షేర్ చేసిన 'టిల్లు స్క్వేర్' బ్యూటీ!

అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో పోస్ట్‌ చేసింది.తనకు నడుము నొప్పి వస్తుందని తెలుపుతూ.. అందుకు చికిత్స ఏదైతే బాగుండూ అంటూనే రోడ్ రోలర్‌తో మసాజ్ అయితే బాగుంటుందని అర్థం వచ్చేలా ఓ ఫోటో షేర్ చేసింది. నెటిజన్స్ దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Anupama Parameswaran : అనుపమకి అలాంటి మసాజ్ కావాలంట.. ఫోటో షేర్ చేసిన 'టిల్లు స్క్వేర్' బ్యూటీ!

Tillu Square Beauty Anupama Parameswaran : టాలీవుడ్ (Tollywood) లో ఈ ఏడాది 'టిల్లు స్క్వేర్' (Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ సినిమాలో స్టార్ బాయ్ సిద్ధుతో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసి కుర్రకారును బాగా అట్రాక్ట్ చేసింది. అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివా గా ఉంటూ అక్కడా గ్లామర్ షో చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో పోస్ట్‌ చేసింది.

తనకు నడుము నొప్పి వస్తుందని తెలుపుతూ.. అందుకు చికిత్స ఏదైతే బాగుండూ అంటూనే రోడ్ రోలర్‌తో మసాజ్ (Road Roller Massage) అయితే బాగుంటుందని అర్థం వచ్చేలా ఓ ఫోటో షేర్ చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వగా.. నెటిజన్స్ దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అనుపమ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది.

Anupama Parameswaran

ఇక 'టిల్లు స్క్వేర్' మూవీలో తన హాట్ షోతో చెమటలు పట్టించిన అనుపమ త్వరలోనే 'పరదా' అనే ఓ డిఫెరెంట్ లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతుంది. 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ న్యూఏజ్‌ ట్రావెల్‌ డ్రామా కథాంశంతో సాగనున్నట్లు తెలుస్తోంది. మలయాళ నటి దర్శన రాజేంద్రన్‌, సంగీత, రాగ్‌ మయూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Also Read : ఆ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ చేయలేను.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు