Telangana: ఉపాధి హామీ పనుల్లో దొరికిన పురాతన రాతి పాత్ర.. తెరిచి చూడగా

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లిలో కూలి పనికి వెళ్లినవారికి పురాతన కాలం నాటి 25 వెండి నాణేలు, రెండు వెండి ఉంగరాలు దొరికాయి. అవి నిజాం కాలం నాటివని పలువురు అధికారులు భావిస్తున్నారు. వాటిని పురావస్తు శాఖకు పంపించనున్నారు.

New Update
Telangana: ఉపాధి హామీ పనుల్లో దొరికిన పురాతన రాతి పాత్ర.. తెరిచి చూడగా

Siddipet: కొన్నిసార్లు ఏదైనా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నప్పడు పురాతన వస్తువులు బయటపడి అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అయితే తాజాగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బుధవారం రోజున ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీ పనుల కోసం వెళ్లినవారికి ఓ రాతి పాత్ర దొరికింది. దాన్ని తెరిచేందుకు ముందుగా కూలీలు భయపడ్డారు. చివరికి కొంతమంది కూలీలు దాన్ని తెరిచి చూడగా.. అందులో పురాతన కాలం నాటి 25 వెండి నాణేలు, రెండు వెండి ఉంగరాలు దొరికాయి.

Also Read: తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

పురాతన నాణేలు దొరికిన విషయం గ్రామమంతా తెలియడంతో.. చేర్యాల సీఐ శ్రీను, మద్దూరు తహశీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీవో రామ్మోహన్‌, పలువురు అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. అయితే నాణేలను, ఉంగరాలను పరిశీలించగా.. అవి నిజాం కాలం నాటి నాణేలుగా భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వాటిని పురావస్తు శాఖరు పంపించనున్నట్లు పేర్కొన్నారు.

Also Read: డాడీ..లే..డాడీ.. తండ్రి చనిపోయిన విషయం తెలియక వెక్కి వెక్కి ఏడుస్తున్న రెండేళ్ల బాలుడు..!

Advertisment
తాజా కథనాలు