ap electricity charges: నాలుగేళ్లలో 7 సార్లు కరెంట్ ఛార్జీలను పెంచుతారా?: ప్రభుత్వంపై వామపక్ష నేతల ఫైర్

పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్‌ చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీల సంతకాల సేకరణ చేశారు. ఈసందర్భంగా సీపీఎం, సీపీఐ, నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా విద్యుత్‌ చార్జీలు పెంచి సామాన్య ప్రజానీకంపై పెనుభారం వేశారని అగ్రహం వ్యక్తం చేశారు.

New Update
ap electricity charges: నాలుగేళ్లలో 7 సార్లు కరెంట్ ఛార్జీలను పెంచుతారా?: ప్రభుత్వంపై వామపక్ష నేతల ఫైర్

పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్‌ చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీల నేతలు సంతకాల సేకరణ చేశారు. ఈసందర్భంగా సీపీఎం, సీపీఐ, నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా విద్యుత్‌ చార్జీలు పెంచి సామాన్య ప్రజానీకంపై పెనుభారం వేశారని అగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఉండవల్లి ఓ ప్యాకేజీ లీడర్‌.. సజ్జల అక్రమాలు బయటపెడతాం.. బుద్దా వెంకన్న ఫైర్

పెరిగిన వీడియో చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మూడు ప్రాంతాలలో సంతకాల్లో సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో దాదాపు 7సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజలను తీవ్ర ఆర్థిక భారాన్ని గురిచేస్తుందని ధ్వజమెత్తారు. కేవలం పేద మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారిని ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. స్మార్ట్ మీట్లను ఏర్పాటు చేసి విద్యుత్ బారాన్ని మరింత పెంచేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు

రైతులకు ఉచిత విద్యుత్ కాకుండా స్మార్ట్ మీటర్ల బిగించి రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సైతం స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తుంటే.. కేవలం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను స్వాగతిస్తుందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పై కేసుల కోసమే కేంద్ర ప్రభుత్వం వద్ద తలవంచి వారి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలను పీడింపుకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను విరమించుకోవడంతో పాటు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించుకోకపోతే కలిసి వచ్చే వామపక్ష పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: అరటితొక్కతో పాదాలు తెల్లగా..

Advertisment
తాజా కథనాలు