ap electricity charges: నాలుగేళ్లలో 7 సార్లు కరెంట్ ఛార్జీలను పెంచుతారా?: ప్రభుత్వంపై వామపక్ష నేతల ఫైర్
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లో వామపక్షాల ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీల సంతకాల సేకరణ చేశారు. ఈసందర్భంగా సీపీఎం, సీపీఐ, నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజానీకంపై పెనుభారం వేశారని అగ్రహం వ్యక్తం చేశారు.