Global warming:కరుగుతున్న మంచు ఫలకాలు..భూమి స్థితిగతులనే మార్చేస్తుందా? ఆర్కిటిక్, అంటార్కిటికాల్లో ఎల్లప్పుడూ మంచు ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ ఉష్ణోగ్రతలు మైనస్‌లలోనే ఉంటాయి. ఇదొక మంచు ఎడారి. ఫుల్ ఐస్ గ్లేసియర్స్ తో నిండి ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. రోజురోజుకూ మంచు ఫలకాలు కరిగిపోతుండడమే దీనికి కారణం. By Manogna alamuru 27 Dec 2023 in ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ఆ ప్రాంతంలో రెండే రెండు ఉంటాయి. ఒకటి మంచు, రెండు నీళ్ళు. ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఈ ప్రదేశం భూభాగానికి టాప్ లో ఉంటుంది. అదే అంటార్కిటికా. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ మైనస్ లలో ఉంటుంది. అంటార్కిటికాలో కనీస ఉష్ణోగ్రత -34 డిగ్రీల సెల్సియస్. ఒక్కోసారి ఇది -89 వరకు కూడా పడిపోతుంటుంది. మంచు ఫలకాలతో నిండి ఉండి ఈ ప్రాంతాలను ఎడారులు అంటారు. ఎందుకంటే ఇక్కడ వర్షపాతం అతి తక్కువగా ఉంటుంది. అంటార్కిటికాలో ఎక్కడా వృక్షాలు కనిపించవు. అలాగే మనుషులుకూడా ఉండలేరు. పెంగ్వాన్, ధృవపు ఎలుగుబంట్లులాంటి కొన్ని జంతువులు మాత్రమే మనుగడ సాగించగలవు. నీళ్ళుల్లో, మంచులో పెరిగే కొన్ని మొక్కలు కూడా అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అంటార్కిటికాలో వేల ఏళ్ళగా మంచు పడుతూనే ఉంది. అది గడ్డకట్టి ఫలకాలుగా రూపాంతరం చెందుతూనే ఉన్నాయి. ఇక్కడ మంచు ఫలకాలు ఉంటేనే మన భూమి సరిగ్గా ఉన్నట్టు. ఎక్కడకు తగ్గట్టు అక్కడ పరిస్థితులు సరిగ్గా, స్థిరంగా ఉంటేనే మిగతా భూభాగం అంతా సవ్యంగా ఉండగలుగుతుంది. లేదంటే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. అయితే ఇది జరగడానికి ఎన్నో రోజులు పట్టదు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే అంటార్కిటికాలో మంచు ఫలకాలు చాలా వేగంగా కరిగిపోతున్నాయని చెబుతున్నారు. గత45 ఏళ్ళల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో ఈ ఏడాది ఇక్కడ మంచు పడిందని చెబుతున్నారు. గత శీతాకాలంతో పోల్చుకుంటే 16 లక్షల చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో మంచు తగ్గింది. మంచు ఎక్కువగా పడుతుంటేనే గ్లేసియర్స్ స్థిరంగా ఉండగలవు. ఎందుకంటే మంచు ఎప్పుడూ కరిగిపోతూనే ఉంటుంది. పాతది కరిగినప్పుడు...కొత్తది పడి దానిని పూర్తి చేస్తుంది. ఈ ప్రోసెస్ లోనే మంచు ఫలకాలు స్థిరంగా ఉంటాయి. కొత్త మంచు పడక, పాతది కరిగిపోతుంటే...ఫలకాలు కూడా మాయం అయిపోతాయి. ఇప్పుడు అంటార్కిటికాలో పరిస్థితి ఇదే. కొత్తగా మంచు కురవకపోవడం వలన...పాతవి తొందరగా కరిగిపోతున్నాయి. దీనికి కారణం భూమి మీద ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడమే. ఎందుకంటే భూమిపై ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటే కానీ..అంటార్కిటికా మంచు కరిగిపోదు. అంటే మంచు కరిగిపోయిందంటే భూమి అగ్నిగోళంగా మారిపోయిందనడానికి సంకేతం. ప్రపంచవ్యాప్తంగా వేడి విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు మనిషి మనుగడే ప్రమాదంలో పడిపోతుంది. ఇక్కడి ఫాజిల్ రికార్డ్‌ల ఆధారంగా చూస్తే...35 మిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడ మంచు ఫలకాలు ఏర్పడ్డాయి. అప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం అక్కడి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల మేర పెరిగాయి. కర్బన ఉద్గారాలు దారుణంగా పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే 2050 నాటికి అంటార్కిటికా కరిగే వేగం పెరుగుతుందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే భూబాగం మీద నీటి శాతం పెరిగిపోతుంది. అంటార్కిటికాలో మంచు కరిగి నీరుగా మారితే భూమి మీద చాలా మార్పులు జరుగుతాయి.ముఖ్యంగా భూభ్రమంణంలో తేడా వస్తుంది. మంచు అంతా కరిగి సముద్రంలో కలిసిపోతాయి. అప్పుడు భూమి తిరిగే వేగం పెరగడమో, తగ్గడమో అవుతుంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికున్న అంచనాల ప్రకారమైతే...ఒకవేళ భూమి తిరగడంలో మార్పు వస్తే అప్పుడు పగటి సమయం కనీసం 20 సెకన్లు ఎక్కువగా నమోదవ్వచ్చు. మరోవైపు అంటార్కిటికా మంచు కరిగితే...సముద్రపు పక్షులు, పెంగ్విన్‌లు, సీల్స్, వేల్స్‌తో పాటు మరి కొన్ని సముద్ర జీవులూ అంతరించిపోతాయి. దీంతో పాటూ మంచులో ఎన్నో ఏళ్ళుగా గడ్డకట్టుకుపోయి ఉన్న మైక్రోబ్స్ కూడా యాక్టివ్ అయ్యే ప్రమాదముంది. వీటి కారణంగా ఎన్నో వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదముంది. వీటితో పాటు మరి కొన్ని సూక్ష్మజీవులూ బయటకు వస్తాయి. ఇప్పటికే అంటార్కిటికాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే జరుగుతోంది. మంచంతా కరిగిపోయి ఆ నీళ్ళన్నీ విస్తరిస్తే...ప్రజలకు తాగేందుకు స్వచ్ఛమైన నీళ్ళు దొరకడమే గగనమవుతుంది. ఈ గ్లేషియర్స్ ద్వారా లక్షలాది మందికి మంచి నీళ్ళు అందుతున్నాయి. వాళ్ళందరిపైనా ప్రభావం పడుతుంది. #earth #antarctica #global-warming #glaciers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి