Loan App Harassment : మరోసారి లోన్ యాప్ (Loan App) నిర్వాహకులు మరోసారి రెచ్చిపోయారు. వారి వేధింపులు భరించలేక ఇద్దరు ఆత్మహత్య (Suicide) కు యత్నించగా..ఒకరు మృతి చెందగా..మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ రెండు ఘటనలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar District) లోనే జరిగాయి. కరీంనగర్ లోని కోతిరాంపూర్ లో నివాసం ఉండే గూడ సతీష్ రెడ్డి(35) కొన్ని రోజుల క్రితం లోన్ యాప్ లో అప్పు తీసుకున్నాడు.
కోర్టు చౌరస్తాలో సతీష్ అసోసియేట్ కన్సల్టెన్సీ పేరిట ఆఫీస్ ఏర్పాటు చేసుకొని అవసరం ఉన్నవారికి పలు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తుంటాడు. ఈ క్రమంలోనే లోన్ యాప్ ద్వారా తీసుకున్న అప్పు చెల్లించడంలో కొంచెం ఆలస్యం కావడంతో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మొదలయ్యాయి. లోను చెల్లించకపోతే భార్య పిల్లల అంతు చూస్తామని బెదిరించడంతో మనస్తాపం చెందిన సతీష్ తన ఆఫీస్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతునికి భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. లోన్ యాప్ లో తీసుకున్న డబ్బులు చెల్లించాలని ఫోన్ కాల్, వాట్సాప్ కాల్స్ తో వేధాంచారని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. సతీష్ చనిపోతే మీరు కట్టాలంటూ మమ్మల్ని కూడా వేధిస్తున్నారని మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని...
కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన తూండ్ల శ్రీనివాస్ లోన్ యాప్ వేధింపులతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు గమనించి మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా తీసుకున్న లోన్ చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తుండడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Also Read : గుడ్లవల్లేరు లేడీస్ హాస్టల్ లలో సీసీ కెమెరాలు.. ఘటనపై ఎస్పీ షాకింగ్ కామెంట్స్..!