AP : గుడ్లవల్లేరు లేడీస్ హాస్టల్ లలో సీసీ కెమెరాలు.. ఘటనపై ఎస్పీ షాకింగ్ కామెంట్స్..! గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ వాష్రూమ్ లలో ఎటువంటి సీసీ కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ ఆర్ గంగాధరరావు స్పష్టం చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ల్యాప్ టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ముందే పరిశీలించామన్నారు. By Jyoshna Sappogula 30 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Gudlavalleru Engineering College Women's Hostel Issue : కృష్ణా జిల్లా (Krishna District) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ (Gudlavalleru Engineering College) లేడీస్ హాస్టల్ లో ఎటువంటి రహస్య సీసీ కెమెరాలు అమర్చలేదని ఎస్పీ ఆర్ గంగాధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లేడీస్ హాస్టల్ వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాలు (Hidden Camera's) పెట్టారని గత రాత్రి విద్యార్థినుల ఆందోళనపై వెంటనే స్పందించామన్నారు. ఈ ఘటనపై గుడ్లవల్లేరు పీఎస్ లో కేసు నమోదు అయిందని.. బాలికల హాస్టల్ లో ఎటువంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని స్పష్టం చేశారు. నేరారోపణల ఎదుర్కొంటున్న వారి ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ముందే పరిశీలించామన్నారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు కనుగొనబడలేదని ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థినులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని.. కేసు తదుపరి విచారణ పురోగతిలో ఉందని ఎస్పీ గంగాధరరావు వివరించారు. Also Read : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు.. కారణం ఇదే.. #vijayawada #hidden-cameras #gudlavalleru-engineering-college మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి