Rave Party : రేవ్ పార్టీ కేసు.. మరో ట్విస్ట్ ఇచ్చిన హేమక్క!

డ్రగ్స్ కేసులో హేమ మరో ట్విస్ట్ ఇచ్చింది. బెంగుళూర్ రేవ్ పార్టీలో హేమ తన పేరు బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణవేణి అనే పేరుతో ఈ పార్టీకి హేమ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
Rave Party : రేవ్ పార్టీ కేసు.. మరో ట్విస్ట్ ఇచ్చిన హేమక్క!

Another Twist In Bangalore Rave Party : బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ (Actress Hema) పేరు బయటికి వచ్చిన విషయం తెలిసిందే కదా.. పోలీసులు కూడా హేమ రేవ్ పార్టీలో ఉందాని స్పష్టం చేసినా కూడా హేమ మాత్రం తనకు రేవ్ పార్టీ కి సంబంధం లేదన్నట్టు చెబుతూ ఇప్పటికే రెండు వీడియోలు సైతం రిలీజ్ చేసింది.

ఇక తాజాగా నార్కోటిక్ పోలీసులు హేమ బ్లడ్ సాంపుల్స్ ని కలెక్ట్ చేయగా.. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ (Drugs) ఆనవాలు గుర్తించారు. దీంతో హేమ బండారం అంతా బయట పడింది. అయితే ఇదే డ్రగ్స్ కేసులో హేమ మరో ట్విస్ట్ ఇచ్చింది. బెంగుళూర్ రేవ్ పార్టీలో హేమ తన పేరు బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read :రేవ్ పార్టీ కేసు.. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు!

కృష్ణవేణి (Krishnaveni) అనే పేరుతో ఈ పార్టీకి హేమ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన పేరు ఎక్కడా బయటకి రాకుండా హేమ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులు ఆమె బండారం అంతా బట్టబయలు చేశారు. మరోవైపు పోలీసులు నిర్వహించిన నార్కోటిక్ టిస్ట్ లో హేమతో పాటూ నటి ఆశి రాయ్ కి (Actress Ashi Roy) సైతం పాజిటివ్ రాగా.. బెంగుళూరు సీసిబి పోలీసులు వీళ్లకు నోటీసులు పంపినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు