హైదరాబాద్ నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. బోరబండ పీఎస్ పరిధిలో ఇద్దరు పిల్లలను చంపేసి తల్లి జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. బోరబండ డివిజన్ మధురానగర్‌లో శుక్రవార ఉదయం ఈ ఘటన కలకలం సృష్టించింది. నగరానికి చెందిన జ్యోతి, విజయ్ భార్యభర్తతలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జ్యోతి టీజర్‌గా పనిచేస్తోంది. అయితే కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలు అర్జున్ (4), ఆదిత్య (2) విషమిచ్చి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు గమనించేలోగా జ్యోతి శవం వేలాడుతూ కనిపించగా.. ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. తల్లీపిల్లల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య, పిల్లల విషయం తెలుసుకున్న భర్త విజయ్ కూడా ఆత్మహత్యాయత్నం ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీసులు, స్థానికులు విజయ్‌ని ఆస్పత్రికి తరలించారు.
అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతికి తన మేన బావతో పెద్దలు వివాహం జరిపించారు. జ్యోతి దంపతులకు అర్జున్, ఆదిత్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులకు పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఆరు సంవత్సరాలు దాటిన పెద్ద కుమారుడు ఆదిత్య సరిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికీ నడవలేని స్థితిలో సంవత్సరంన్నర వయసున్న చిన్న కుమారుడు అర్జున్. పిల్లల అనారోగ్యంతో జ్యోతి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానట్లు తెలిపారు. ఇదే నేపథ్యంలో ఉదయం 8 గంటలకు ఇద్దరు పిల్లలకు పాలలో పురుగుల మందు కలిపి ఇచ్చిన అనంతరం జ్యోతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కుటుంబ కలహాలతోనే..
ఇక.. హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి.. తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓల్డ్ బోయిన్‌పల్లి భవానినగర్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది. శ్రీకాంతా చారి(42) వెండి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇద్దరు కూతుళ్లు స్రవంతి (8), శ్రావ్య (7)లకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి తాను కూడా వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే ఇంట్లో ముగ్గురూ చనిపోవటంతో బోయినపల్లి పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతోనే శ్రీకాంతా చారి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఇది కూడా చదవండి: బంగారం రేట్.. పసుపు రేట్ ఒకేలా ఉంది: ఎంపీ అరవింద్