AP Sankranthi Special Trains: సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి శుభవార్త... మరో మూడు స్పెషల్ ట్రైన్లు!

దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి మరో మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌. నాందేడ్ నుంచి కాకినాడ టౌన్‌ కి మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!
New Update

Sankranthi Special Trains: సంక్రాంతికి ఊరెళ్లాలనుకుంటున్నారా..అయితే ఈ గుడ్‌ న్యూస్‌ మీకోసమే. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో సొంతూర్లకు వెళ్లే వారితో బస్‌ స్టాండ్‌ లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను(South Central Railway)  నడుపుతున్నాయి.

ఇప్పటికే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను (Special Trains) , బస్సులను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే మరో మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ కి శుక్రవారం రాత్రి 8 గంటల 5 నిమిషాలకు తిరుపతి నుంచి బయల్దేరుతోంది. ఈ రైలు నంబర్‌ 07060. ఇది రేణిగుంట, గూడూరు,నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికూడు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నంబర్‌ 07487 హెచ్‌ఎస్‌ నాందేడ్‌ నుంచి కాకినాడ టౌన్‌ కి 15 న మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు కాకినాడ టౌన్‌ కి చేరుకుంటుంది. తిరిగి కాకినాడ టౌన్‌ నుంచి హెచ్‌ఎస్‌ నాందేడ్‌ కి మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయానికి కాకినాడ టౌన్‌ కి చేరుకుంటుంది.

ఈ స్పెషల్‌ ట్రైన్స్‌ లో ఏసీ, ఏసీ స్లీపర్‌, ఏసీ 3 టైర్‌, స్లీపర్‌ క్లాస్‌ , జనరల్‌ బోగీలను కూడా ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Also read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1646 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

#sankranthi #secundrabad #special-trains #kakinada
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి