హైదరాబాద్‌లో మరో టెన్షన్ నెలకొంది. మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. హిమాయత్ సాగర్.. ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతోనే వరద పోటెత్తింది. ముసారాంబాగ్ వంతెనకు చేరువలో మూసీ వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గతంలో జరిగిన వరద ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Also read: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దు.. హైకోర్టులో పిటిషన్
ఇదిలాఉండగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలు, వ్యాపార సంస్థలపై త్వరలో చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్‌కు చెందిన థ్రిల్ సిటీ, ఈట్ స్ట్రీట్‌లపై హైడ్రా చర్యలు చేపట్టింది. బఫర్ జోన్‌లో కట్టిన మరికొన్ని వ్యాపార సంస్థల పైనా చర్యలు తీసుకోనుంది.