Telangana DSC: త్వరలో మరో 6 వేల టీచర్ పోస్టులు: భట్టి విక్రమార్క

11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు మరో పది రోజుల్లో విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాగే మరో 6 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

New Update
Telangana DSC: త్వరలో మరో 6 వేల టీచర్ పోస్టులు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: మరో 6 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో 17, 862 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను అందించడం కోసం జీవో జారీ చేసినట్లు పేర్కొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు మరో పది రోజుల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మరో 6 వేల ఉపాధ్యాయులు పోస్టుల భర్తీకి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్‌ చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: డీఎస్సీ ఫైనల్ ‘కీ’ విడుదల.. ఇదిగో లింక్

అలాగే రాష్ట్రంలో రూ.667 కోట్లతో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని.. వాటి నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించినట్లు చెప్పారు. పరిశ్రమలకు అసవరమైన మానవ వనరులను అందించేందుకు నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. 63 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.300 కోట్లు వెచ్చించామని.. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ రూ.100 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు