కాంగ్రెస్ కు మరో షాక్.. బీఆర్ఎస్ లోకి నాగం జనార్ధన్ రెడ్డి?

తెలంగాణ కాంగ్రెస్‎కు మరో గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడనున్నట్లు సమాచారం. నాగం నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నాగం మరో రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ లో చేరే ఛాన్స్ ఉంది. ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ తో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ అవుతారని సమాచారం.

కాంగ్రెస్ కు మరో షాక్.. బీఆర్ఎస్ లోకి నాగం జనార్ధన్ రెడ్డి?
New Update

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. నాగం జనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూలు నుంచి టికెట్ ఆశించారు. కానీ ఆ టికెట్ దక్కకపోవడంతో నిరాశలో ఉన్న నాగం ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారట. మరో రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ లో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ తో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ అవుతారని సమాచారం. తమ పార్టీలోకి రావాలని మంత్రి కేటీఆర్ ఆహ్వానించనున్నారట. జనార్ధన్ రెడ్డి త్వరలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇది కూడా చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం… నటుడు అనుమానాస్పద మృతి..!!

కాగా నాగర్ కర్నూల్ టికెట్ రాజేశ్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి నాగం తీవ్ర నిరాశలో ఉన్నారు. కాంగ్రెస్ లో టికెట్ రానివారంతా బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎల్ లో టికెట్ రానివారంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన జగదీశ్వర్ గౌడ్ రాకపోవడంతో హస్తం గూటికి చేరారు. పటాన్ చెరువు నుంచి బీఆర్ఎస్ నేత నీలం మధు బీఆర్ఎస్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు.

#brs #congress #nagar-kurnool #naagam-janardhanreddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe