AP Government : ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ (YS Jagan) ఫోటోతో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చలు జరిపారు.
తిరిగి రాజముద్రతో భూహక్కు పత్రాల పంపిణీ చేయాలని నిర్ణయించారు.
Also Read: ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు.. ట్విస్ట్‌లతో అదరగొట్టిన నాగ్ అశ్విన్
పాత పద్ధతిలోనే పాసు బుక్కుల (Passbook) డిజైన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 4,618 గ్రామాల్లో 20.19 లక్షల పాసు బుక్కుల పంపిణీ చేశారు. 'జగనన్న భూ హక్కుపత్రం' పేరుతో పాసు పుస్తకాలను గత ప్రభుత్వం పంపిణీ చేయగా జగన్ ప్రభుత్వ తీరుపై రైతుల్లో వ్యతిరేకత కనిపించింది.
Also Read: ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసిన నాగ్ అశ్విన్.. ‘కల్కి’లో ఈ ఐదుగురి గెస్ట్ రోల్స్ అస్సలు ఊహించలేదే!
కాగా, జగన్ ఫోటోతో ఉన్న పాసు బుక్కులు రద్దు చేస్తామని కుప్పం (Kuppam) ఎన్నికల ప్రచారం (Election Campaign) లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం కొత్త పాస్ బుక్కుల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొత్తవి ఎలా ముద్రించాలి, ఎప్పటి నుంచి పంచాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.