Tamil Nadu: తమిళనాడులో దారుణం.. మరో పార్టీ నేత హత్య తమిళనాడులోని మధురైలో నామ్ తమిజార్ కట్చి పార్టీ (NTK) నేత బాలసుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఇటీవలే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కే.ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య జరిగిన వారం రోజులకే ఎన్టీకే నేతను మర్డర్ చెయ్యడం కలకలం రేపుతోంది. By B Aravind 16 Jul 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి తమిళనాడులోని మధురైలో దారుణం చోటుచేసుకుంది. నామ్ తమిజార్ కట్చి పార్టీ (NTK) నేత బాలసుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. మార్నింగ్ వాక్‌కు వెళ్లినప్పుడు ఆయన్ని దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని.. ప్రతీకార దాడి అని పేర్కొన్నారు. కుటుంబ వివాదాల వల్లే ప్రతీకారంతో ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని.. ఇంకా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అయితే గతంలో బాలసుబ్రహ్మణ్యానికి మూడు మర్డర్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. Also read: కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు! ఇటీవలే తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు కే.ఆర్మ్‌స్ట్రాంగ్‌ని బైక్‌లపై వచ్చిన ఆరుగురు దుండగులు హత్య చేశారు. ఈ ఘటన జరిగిన వారం రోజులకే ఎన్టీకే పార్టీ నేత హత్య జరగడం కలకలం రేపుతోంది. అయితే గ్యాంగ్‌స్టర్ ఆర్కట్ సురేష్ హత్యకు ప్రతీకారంగానే ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. సురేష్ కుటంబ సభ్యులే ఆయన్ని హత్య చేసేందుకు ప్లాన్ వేశారని పేర్కొన్నారు. అయితే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో ఉన్న 11 నిందితుల్లో ఒకరు.. చైన్నైలో ఆదివారం పోలీసుల ఎన్‌కౌంటర్లో మృతి చెందాడు. అతడి నుంచి దేశీయ తుపాకీని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా తుపాకితో పేల్చాడని పోలీసులు తెలిపారు. అందుకే తాము అతడిపై కాల్పులు జరపగా చనిపోయినట్లు పేర్కొన్నారు. Also read: పూరీ జగన్నాధుని రత్నభాండాగారం కింద మరో నిధుల గది.. కొత్త విషయం వెలుగులోకి #telugu-news #murder #tamilnadu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి