MEGHA Company : మరోసారి బయటపడ్డ మేఘా నిర్వాకం.. కుప్పకూలిన ప్రహారీ గోడ

మేఘా సంస్థ నిర్వాకం మరోసారి బయటపడింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలిపోయింది. కాంట్రక్టర్, ఇంజినీర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రూ.2,215కోట్లతో మేఘా సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది.

MEGHA Company : మరోసారి బయటపడ్డ మేఘా నిర్వాకం.. కుప్పకూలిన ప్రహారీ గోడ
New Update

Sunkishala Project : మేఘా సంస్థ (Megha Company) నిర్వాకం మరోసారి బయటపడింది. తెలంగాణ (Telangana) లోని నల్గొండ జిల్లా (Nalgonda District) నాగార్జున సాగర్‌ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలిపోయింది. కాంట్రక్టర్, ఇంజినీర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో 300 మందికి పైగా వలస కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగిఉండేది. రూ.2.215 కోట్లతో మేఘా సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. టన్నెల్స్‌లోకి నీళ్లు వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం సుంకిశాల పంప్‌హౌస్‌ నీటమునిగింది.

Also Read: భారత్‌కు మరో పతకం.. కాంస్యం సాధించిన హాకీ టీమ్!

కమీషన్‌ల కోసమే సుంకిశాల పనులు నాసిరంకగా జరుగుతున్నాయని గతంలో కూడా విమర్శలు వచ్చాయి. రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ (BRS) హయాంలో సుంకిశాల పనులు మొదలయ్యాయి. అయితే రిటెయినింగ్ వాల్ కుప్పకూలిన ఘటన ఆగస్టు 1న జరిగింది. కానీ వారం రోజులుగా విషయాన్ని బయటకు రానియ్యకుండా మెఘా సంస్థ రహస్యంగా ఉంచింది.

Also Read: బిత్తిరి సత్తిపై మరో కేసు నమోదు.. బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్న హిందూ సంఘాలు!

#telugu-news #megha-company
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe