Bitthiri Sathi: ప్రముఖ టీవీ యాంకర్, హాస్య నటుడు బిత్తిరి సత్తి (రవి)పై మరో కేసు నమోదైంది. హిందూ ధర్మాన్ని, హిందువులను, హిందూ దేవుళ్లను కించపరుస్తూ అవహేళనగా వీడియోలు చేస్తున్నాడంటూ సూర్యాపేట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పలు హిందూ సంఘాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తి హిందువులపై మళ్ళీ అహంకార పూరిత అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తి బహిరంగంగా మీడియా ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే హిందువుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే నగరంలో వానరసేన ఫిర్యాదుతో సత్తిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన బిత్తిరిసత్తి.. తాను ఏ తప్పు చేయలేదంటూ సెల్ఫీ వీడియో నెట్టింట షేర్ చేశాడు. కావాలనే తనపై తప్పుడు వీడియోలు సర్కూలేట్ చేస్తున్నారన్నాడు.