/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-50-2.jpg)
Another Leak From Game Changer Movie : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్' కు లీకుల బెడద అస్సలు తప్పడం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రామ్ చరణ్ లుక్ తో పాటూ కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫుటేజ్ లీక్ అయింది. ఆ మధ్య ఏకంగా పాటనే సోషల్ మీడియాలో లీక్ చేసేశారు. మూవీ టీమ్ దీనిపై ఎన్ని జాగ్రతాలు తీసుకున్నా సరే.. ఎవరో ఒకరు ఏదో విధంగా లీక్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లీక్ బయటికొచ్చింది. గేమ్ ఛేంజర్ లేటెస్ట్ షూటింగ్‌కు సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన సీన్‌ను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. వీడియో చూస్తే రామ్ చరణ్, విలన్‌కు మధ్య కీలక సన్నివేశంగా కనిపిస్తోంది. ఇది చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ మూవీ సన్నివేశాలు లీక్ కావడంపై మండిపడుతున్నారు.
#Gamechanger Leaked scene here it's...
An Airport sequence 🌟
Shankar cooking something against #government 😂💥#Ramcharan #Shankar #Kollywood #Tollywood #Raayantrailer #indian2 pic.twitter.com/0W2w9gpeiU
— WALTER WHITE 🅴 (@walter___exe) July 16, 2024
Also Read : ఆ చీకటి రోజులు మళ్ళీ నా జీవితంలో రాకూడదు.. గతం గుర్తు చేసుకుని బాధపడ్డ సమంత!
ఈ విషయంలో మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమానుఅగ్ర నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.